Roshan Kanakala emotional: యాంకరింగ్ రంగంలో దిగ్గజం లాగా మూడు దశాబ్దాల నుండి కొనసాగుతున్న సుమ(Suma Kanakala), తన వారసుడు రోషన్ ని ఇండస్ట్రీ కి ‘బబుల్ గమ్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, రోషన్ కి నటుడిగా ఆడియన్స్ లో మంచి గుర్తింపు దక్కింది. కుర్రాడు నటన చాలా డీసెంట్ గా ఉంది, డైలాగ్ డెలివరీ కూడా బాగుంది, కచ్చితంగా ఇండస్ట్రీ లో సక్సెస్ అవుతాడు అనే ఆశని కలిగించింది ఈ చిత్రం. ఈ చిత్రం తర్వాత రోషన్ ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తో ‘మోగ్లీ'(Mowgli Movie) అనే చిత్రం చేసాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ‘అఖండ 2’ ని తట్టుకొని నిలబడుతుందో లేదో తెలియదు కానీ, మొదటి చిత్రం కంటే కాస్త డీసెంట్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రన్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు రోషన్ ప్రొమోషన్స్ లో చాలా గట్టిగానే పాల్గొన్నాడు. ఒక ఈవెంట్ లో ఆయన గతం లో తన తల్లిదండ్రుల విడాకుల గురించి వచ్చిన రూమర్స్ గురించి రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మా అమ్మా నాన్నలు విడిపోయారని గతం లో వార్తలు వచ్చినప్పుడు, నేను అది చూసి చాలా బాధపడ్డాను. వాళ్ళు కూడా ఆ వార్త ని విని చాలా డిస్టర్బ్ అయ్యారు. కానీ మా అమ్మ నాకు ధైర్యం చెప్పడం తో ఇలాంటి వార్తలను నమ్మడం ఆపేసాను. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లిద్దరూ ఎంత ప్రేమగా ఉంటారో మాకు తెలుసు. కానీ ఈ వార్త వచ్చినప్పుడు తెలిసిన స్నేహితులు, బంధుమిత్రులు ఫోన్లు చేసి అవునా, నిజమా అని అడుగుతూ ఉంటారు. వాళ్లకు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందిగా అనిపించేది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రోషన్ తన మొదటి సినిమా విడుదల సమయం లో కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. కానీ సోషల్ మీడియా లో ఈ పుకార్లకు మాత్రం చెక్ పడలేదు. కనీసం ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. ఇక మోగ్లీ విషయానికి వస్తే ఈ చిత్రానికి సోషల్ మీడియా లో వస్తున్న టాక్ ఆడియన్స్ ని అయ్యోమయ్యం లోకి నెట్టింది. ఎందుకంటే చాలా వరకు పైడ్ ట్వీట్స్ కనిపిస్తున్నాయి. సినిమాని చూసిన ఆడియన్స్ చెప్పే టాక్ కి, తేడా తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నెటిజెన్స్.
