Sukumar: పెద్ద సినిమాలకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ? సినిమా పూర్తి అయ్యాక గానీ, చెప్పలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం. అసలు ఓ స్టార్ హీరోతో సినిమాను పూర్తి చేయాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టే ఆనవాయితీ టాలీవుడ్ కి ఈ మధ్య బాగా పాకింది. పాన్ ఇండియా సినిమా అంటూ లేనిపోని గొప్పలకు పోయి నిర్మాతల జేబుకు చిల్లు పెడుతున్నారు.

ఈ విషయంలో సుకుమార్ మొదటి నుంచి నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అలాగే చేస్తున్నాడు. సహజంగానే సుకుమార్ సినిమాలంటే బడ్జెట్ పరిమితులు దాటిపోతాయి. కారణం.. పెర్ఫెక్షన్ కోసం సుక్కు బడ్జెట్ ను అడ్డగోలుగా పెంచుతూ పోతాడు. కేవలం పుష్ప పాటల కోసమే సుకుమార్ 15 కోట్లను ఖర్చు పెట్టించాడు.
పుష్పలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఐదు పాటలకు 6 కోట్లు బడ్జెట్ వేశారు. కానీ, ఇంకా ఒక పాట మిగిలి ఉండగానే అప్పుడే 10 కోట్లు ఖర్చు అయిపోయాయి. ఈ రేంజ్ లో ఖర్చు పెట్టించాడు అంటే.. ఆ సాంగ్స్ ను అద్భుతమైన లొకేషన్స్ లో తీశాడనుకుంటే పొరపాటే. మూడు సాంగ్స్ ను అడవిలో చిత్రీకరించాడు.
ఇక మిగిలిన రెండు సాంగ్స్ ను సెట్స్ వేసి తీయబోతున్నాడు. ఇది సుకుమార్ బడ్జెట్ లెక్కల వ్యవహారం. క్రియేటివ్ డైరెక్టర్ అని ముందు పేరు వేసుకుని ఇలా అనవసరంగా భారీగా ఖర్చు పెట్టిస్తే ఎలా ? గతంలో కూడా క్రియేటివిటీ పేరు చెప్పి ప్రొడ్యూసర్స్ ను ముంచిన డైరెక్టర్లు చాలామందే ఉన్నారు. అసలు ఈ క్రియేటివ్ డైరెక్టర్లు సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటారు.
కానీ చివరకు తీసేది ప్లాప్ సినిమా. సుకుమార్ కెరీర్ లో కూడా హిట్లు కంటే కమర్షియల్ గా ప్లాప్ అయిన చిత్రాలే ఎక్కువ. కాకపోతే సుక్కు – బన్నీ కలయికలో సినిమా వస్తోందంటేనే.. అంచనాలు రెట్టింపు ఆవుతాయి. నిజమే.. అంతమాత్రాన ఓవర్ బడ్జెట్ చేస్తే ఎలా.. ? రేపు బడ్జెట్ ఎక్కువై సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోతే.. నష్టపోయేది నిర్మాతలే కదా ?
Also Read: Ghani: పవర్ఫుల్ ప్యాక్‌తో గని టీజర్.. వరుణ్ సిక్స్‌ప్యాక్‌కు అభిమానులు ఫిదా!
మరి ఈ విషయం సుక్కు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.
Also Read: Anushka: బరువు తగ్గేందుకు అనుష్క డైటింగ్ ప్లాన్.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా!