Sudigali Sudheer Team : జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో గురించి బుల్లితెర ప్రేక్షకులు ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్ నుండి వెళ్లిపోతుందట.. అంటూ తెగ బాధ పడిపోతున్నారు. తాజా ప్రోమోలో జబర్దస్త్ వేదిక సాక్షిగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఏళ్లుగా జబర్దస్త్ లో పని చేశాము. ఇప్పుడు జబర్దస్త్ నుండి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాలని అనుకున్నాం… కానీ ఇదే వేదికపై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అంటూ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకున్నారు.

సుడిగాలి సుధీర్ టీమ్ నిర్ణయానికి జడ్జి రోజా, యాంకర్ రష్మీతో పాటు ప్రోమో చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ ప్రోమో ప్రకారం నెక్స్ట్ ఎపిసోడ్ సుడిగాలి సుధీర్ టీమ్ కి చివరిది. అయితే ఇదంతా నిజం అనుకుంటే మనం వెర్రి పప్పలమే. స్కిట్స్ లో వాళ్ళని వాళ్ళు వెర్రిపప్పలను చేసుకునే ఈ జబర్దస్త్ కమెడియన్స్, ఆరు నెలలకోసారి ప్రేక్షకులను కూడా పిచ్చి పుష్పాలను చేస్తూ ఉంటారు. జబర్దస్త్ లో తమకున్న క్రేజ్ వాడుకుంటూ…మనల్ని తప్పుదోవ పట్టిస్తారు.
జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోతున్నాడు… సుడిగాలి సుధీర్ టీమ్ లో లుకలుకలు, ముగ్గురూ విడిపోతున్నారట.. ఇలాంటి హెడ్డింగ్స్, ప్రోమో కట్స్ ఇప్పటికే చాలా చూసేశాం. అయినా ఈ పులిహోర కామెడీ బ్యాచ్ అదే ఫార్ములా వాడుతున్నారు. తాజా ప్రోమోలో వీరు చేసిన కామెంట్స్ లో కూడా నిజం లేదని, సెన్సేషన్ కోసమే అని తెలుస్తుంది. ప్రోమో నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.
Also Read: Brahmanandam: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?
ఓ ప్రక్క సీరియస్నెస్ నటిస్తూ గెటప్ శ్రీను జబర్దస్త్ కి గుడ్ బై చెబుతుంటే.. క్యాప్ పెట్టుకున్న సుధీర్ తలవంచుకుని నోటిని చేయితో కవర్ చేసుకుంటూ నవ్వుని ఆపుకుంటున్నాడు. ఆ పక్కనే ఉన్న రామ్ ప్రసాద్ ముఖంలో కూడా సీరియస్ నెస్ లేదు. తొమ్మిదేళ్లు సాగిన జబర్దస్త్ జర్నీ ముగుస్తుందన్న బాధ లేదు. కాబట్టి సుడిగాలి సుధీర్ టీమ్ మరోసారి చీటింగ్ ప్రోమోతో జనాల అటెన్షన్ కోసం ట్రై చేశారని చెప్పొచ్చు. ఈ మధ్య సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వదిలేస్తున్నాడంటూ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఆ కథనాలలో నుండి పుట్టిన ఆలోచనే ఇది.
Also Read: Pushpa: పరువుతో బన్నీ పోరాటం… అంత ఈజీ కాదు!