Sudigali Sudheer Remuneration: బుల్లితెరపై యాంకర్ గా సుమ(Suma Kanakala) స్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన చిన్నతనం నుండి ఆమె యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సుమ లేనిదే ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగని పరిస్థితి. ఎంత మంది యాంకర్లు వచ్చినా సుమ ని మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఆమె డిమాండ్ ని ఇసుమంత కూడా తగ్గించలేకపోతున్నారు. అలాంటి స్థాయిలో ఉన్న సుమ స్థానంపై ఇప్పుడు సుడిగాలి సుధీర్ కన్నేశాడా?, డిమాండ్ విషయం లో ఇప్పుడు ఆయన సుమ ని సైతం దాటేస్తున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు. ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయం లో సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) ఇప్పుడు సుమ ని కూడా దాటేశాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా ఎన్నో వందల స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?
అలా జబర్దస్త్ మరియు ఇతర ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు సంపాదించిన సుధీర్, మొదట్లో కమెడియన్ గానే సినిమాల్లోకి అడుగుపెట్టాడు కానీ, ఆ తర్వాత హీరో గా మారి పలు సినిమాల్లో నటించాడు. ఆయన హీరో గా నటించిన సినిమాల్లో ‘గాలోడు’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతాడని అనుకుంటే మళ్ళీ బుల్లితెర పై ‘ది ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం తో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతీ ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ కామెడీ షో కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నందుకు సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కి రెండున్నర లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట.
యాంకర్ సుమ ప్రస్తుతానికి ఈటీవీ లో సుమ అడ్డా అనే కార్యక్రమం చేస్తుంది. ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ కి గానూ ఆమె లక్ష 80 వేల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. అంటే సుధీర్ యాంకర్ గా సుమ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నమాట. ఇదే రేంజ్ ఊపు లో ఆయన యాంకరింగ్ రంగానికే పరిమితమైతే మాత్రం భవిష్యత్తులో సుమ ని పూర్తిగా డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.