Sudigali Sudheer: వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ఈటీవీలో సంక్రాంతికి ప్రసారం కానున్న ‘ అల్లుడా మజాకా ‘ స్పెషల్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. కాగా వెంకటేష్ తో పాటు హీరోయిన్స్ మీనా, కుష్భు జాయిన్ అయ్యారు. ఈ ఈవెంట్ హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఆకట్టుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న సుధీర్ ఈటీవీ కి దూరమయ్యాడు.
తాజాగా ఈ స్పెషల్ ఈవెంట్ లో మెరిసాడు. ఎప్పటిలానే తన టాలెంట్ తో అలరించాడు. టిల్లు స్క్వేర్ మూవీ లోని రాధికా పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్ చాలా కాలం తర్వాత మల్లెమాల వారి స్పెషల్ ఈవెంట్లో సందడి చేశాడు. మల్లెమాల సంస్థతో సుధీర్ వివాదం ముగిసింది. కాంప్రమైజ్ అయ్యారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో సుధీర్ మల్లెమాల షోలలో సందడి చేసే అవకాశం లేకపోలేదు.
కాగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొన్న అల్లుడా మజాకా ఈవెంట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆది తన నాన్ స్టాప్ పంచులతో నవ్వులు పూయించాడు. తర్వాత ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. సునామీ సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకున్నాడు.
స్టేజి పైన వెంకటేష్ ముందు, సనత్ నగర్ సత్తి గెటప్ లో సుధాకర్ ‘ రింగ రింగ రింగ రింగా ‘ సాంగ్ పాడాడు. ఏంట్రా అది అని వెంకటేష్ అడిగాడు. పాట అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వెంకటేష్ సుధాకర్ చెంప పగలగొట్టాడు. ఇక నరేష్ ని .. అసలు ఎక్కడ కొట్టాలిరా నిన్ను అంటూ వంగి సైగలు చేశారు. అయితే ఇదంతా స్కిట్ లో భాగమే. వెంకటేష్ ఘర్షణ లో ఏసీపీ రామచంద్ర గెటప్ వేశారు. తన కామెడీ టైమింగ్ తో వెంకటేష్ స్టేజి దద్దరిల్లేట్టు చేసాడు. వెంకీ పెరఫామెన్స్ కి ఖుష్భు విజల్స్ వేసింది. ఇలా అల్లుడా మజాకా ప్రోమో సరదాగా ఆకట్టుకునే విధంగా సాగింది. స్టార్ మా వాళ్ళు నాగార్జున ని గెస్ట్ గా దింపితే .. ఈటీవీ వాళ్ళు వెంకటేష్ ని బరిలోకి దింపారు.