Sudigali Sudheer: బుల్లితెర యాంకర్లుగా పాపులర్ అయ్యి మంచి డిమాండ్ తెచ్చుకుంటున్న యాక్టర్స్ అందరూ ఉన్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్దస్త్ షో తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఢీ లో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. ఒకపక్క జబర్దస్త్ కమెడియన్ గా జనాలను కడుపుబ్బ నవ్విస్తూ మరోపక్క మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి అందరినీ మెప్పించాడు. సుధీర్ తో పాటు జతగా రష్మి ఉంటే చాలు అది ఎలాంటి షో అయినా పర్లేదు రేటింగ్ కి ఎటువంటి ఢోకా ఉండదు అనే అంత క్రేజ్ సంపాదించాడు.
సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీతో హీరోగా బుల్లితెర నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ తన పర్ఫామెన్స్ తో యావరేజ్ టాక్ సంపాదించాడు. అతని మొదటి సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించక పోయినప్పటికీ గత ఏడాది వచ్చిన గాలోడుతో ఓకే అనిపించుకున్నాడు. అయితే ఆ బూస్టింగ్ తో తీసిన 3 మంకీస్ ఊహించిన ఫలితాన్ని అందించలేకపోయింది. వరుస అపజయాలు ఎదురవుతున్న తగ్గేదే లేదు అన్నట్టు
విశ్వక్ సేన్ తో పాగల్ మూవీ చేసిన నరేష్ కుప్పిలి డైరెక్షన్లో G.O.A.T సినిమా చేస్తున్నాడు.
ఈ మూవీ సక్సెస్ విషయంలో సుధీర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క సినిమా పూర్తి అయితే తప్ప ఎటువంటి ప్రమోషన్స్ చేయడానికి సుధీర్ ఇష్టపడడం లేదు. ఈ కారణంగానే సినిమాకు తగినంత బజ్ క్రియేట్ కావడం లేదు అని సినీ విశ్లేషకుల భావన.
మరో పక్క కొంతమంది అనవసరంగా బుల్లితెరను వదిలి సుధీర్ తప్పు చేశాడేమో అన్నా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే సుధీర్ కు హీరో అవ్వాలి అనుకున్న కల నెరవేరే వరకు…మంచి సక్సెస్ సాధించేవరకు వెనుతిరిగే ఉద్దేశం లేదు అనిపిస్తుంది.
గాలోడు చిత్రంతో సక్సెస్ అందుకున్న సుధీర్ తన ఆశలన్నీ రాబోతున్న G.O.A.T మూవీ పై ఉంచాడు. ఈ మూవీ సరికొత్త కథనంతో వినూత్నమైన కాన్సెప్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ సుడిగాలి సుధీర్ కెరియర్ లో మంచి సక్సెస్ అందిస్తుంది అని అంటున్నారు. అయితే బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు హీరో గా వచ్చి సక్సెస్ అయిన వారి సంఖ్య తక్కువనే చెప్పవచ్చు. చాలావరకు సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన వారు ఎందరో బుల్లితెర స్టార్స్ ఉన్నారు.
మరోపక్క జబర్దస్త్ లాంటి బుల్లితెర షో నుంచి వచ్చి డైరెక్టర్ గా సక్సెస్ సాధించిన వేణు లాంటి వ్యక్తులు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ నుంచి వచ్చాము ఎలా వచ్చాం అనే దాని కంటే కూడా.. మన కల నెరవేరడం కోసం ఎంతగా కృషి చేస్తున్నాం అనేది సినీ ఇండస్ట్రీలో ప్రధానమైన అంశం. దీనికి తోడు కాస్త లక్ కూడా ఆడ అవ్వాలి మరి. అందుకే సుధీర్ హీరోగా సక్సెస్ అవ్వాలి అని ఎంతో తపన పడుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బుల్లితెరపై సుధీర్ కు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు సుధీర్ ను బాగా మిస్ అవుతున్నారు. కానీ సుధీర్ మాత్రం మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ స్మాల్ స్క్రీన్ వైపు ఆసక్తి కనబరచడం లేదు. అతని నిర్ణయం సరియైనదా కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.