https://oktelugu.com/

Raveena Tandon: గ్రేట్.. ఈ స్టార్ హీరోయిన్ ఆ పనులు కూడా చేసింది !

Raveena Tandon: ‘కేజీఎఫ్ 2’తో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ ‘రవీనా టాండన్’ షాకింగ్ విషయాలు చెప్పింది. ఎవరైనా వాంతులు చేసుకుంటే రవీనా వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి తుడిచేది అట. ఏమిటి ఇది ? మరీ ఇలాంటి పనులు రవీనా ఎందుకు చేసింది ? అని ఆమె అభిమానులు తెగ ఇదైపోతున్నారు. అసలు రవీనా మాటల్లోనే.. ఆ ఆసక్తికర విషయాలు విందాం. ‘అసలు అప్పట్లో నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే ఉండేది […]

Written By:
  • Shiva
  • , Updated On : April 23, 2022 / 12:35 PM IST
    Follow us on

    Raveena Tandon: ‘కేజీఎఫ్ 2’తో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ ‘రవీనా టాండన్’ షాకింగ్ విషయాలు చెప్పింది. ఎవరైనా వాంతులు చేసుకుంటే రవీనా వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి తుడిచేది అట. ఏమిటి ఇది ? మరీ ఇలాంటి పనులు రవీనా ఎందుకు చేసింది ? అని ఆమె అభిమానులు తెగ ఇదైపోతున్నారు. అసలు రవీనా మాటల్లోనే.. ఆ ఆసక్తికర విషయాలు విందాం.

    Raveena Tandon

    ‘అసలు అప్పట్లో నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే ఉండేది కాదు. నిజానికి మాది సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీనే. అయినా నేనెప్పుడు నటిని కావాలని ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో.. కానీ నిజం. మొదట్లో నేను స్టూడియో ఫ్లోర్స్‌ ను కడిగి తుడిచేదాన్ని. ఆ సమయంలో అక్కడ పార్టీలు ఎక్కువగా జరిగేవి.

    Also Read: Bigg Boss Telugu OTT: వెన్నుపోటు అలకరాజా: బిందుమాధవిపై నెగ్గేందుకు అఖిల్ చేస్తున్న పెద్ద స్కెచ్ ఇదే

    ఆ పార్టీల్లో చాలామంది విపరీతంగా తాగి వాంతులు చేసుకునే వారు. నేను వెళ్లి వాళ్ళను పక్కన కూర్చోపెట్టి ఆ వాంతులను క్లీన్ చేసేదాన్ని. ఇలాంటి పనులు నేను చాలా చేశాను. నేను వాళ్ళను కూడా పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే, వాళ్ళు నన్ను వదిలేవారు. ఆ తర్వాత ప్రహ్లాద్‌ కక్కర్‌ దగ్గర అసిస్టెంట్‌ గా కూడా కొన్నాళ్ళు పని చేశాను.

    Raveena Tandon

    ఆ సమయంలో నన్ను చూసి.. నువ్వు స్క్రీన్‌ ముందు ఉండాల్సినదానివి అంటూ మెచ్చుకునే వారు. కానీ.. నేను నటిని అవ్వాలని, అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ, అనుకోకుండా ప్రహ్లాద్‌ కక్కర్‌ దగ్గర డూప్ మోడల్ గా మారాను. నేను మేకప్‌ వేసుకుని కొన్ని పోజులిఇవ్వడం అలవాటు చేసుకున్నాను. అదే నన్ను మీ ముందు నిలబెట్టింది.

    ఐతే, ఉచితంగా నేను ఎందుకు ఫొటోలకు పోజులివ్వాలి ? డబ్బు ఇస్తేనే చేస్తా అన్నాను. ఇస్తాం, కానీ.. ఎక్స్ పోజింగ్ కూడా చేయాలి అన్నారు. చేస్తే.. డబ్బు సంపాదించొచ్చు అనిపించింది. అంతే.. అప్పటి నుంచి వాళ్ళు ఏం చెబితే అది చేశాను. ఆ వెంటనే నాకు సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి’ అంటూ రవీనా టాండన్ తన సినీ జర్నీని చాలా ఓపెన్ గా చెప్పేసింది.

    Also Read:Sarkaru Vaari Paata: ‘సర్కారు’ మోత మోగింది.. మహేష్ రికార్డుల వేట మొదలైంది !

    Recommended Videos:


    Tags