Mahesh Babu: కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టాయి.మాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ పోస్టర్ రిలీజ్ చేసిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు… మహేష్ బాబు తన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది హీరోయిన్లతో సినిమాలను చేశాడు. అతనితో సినిమాలు చేసిన కొంతమంది నటీమణులు స్టార్ హీరోయిన్స్ గా మారితే మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కృతి సనన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కృతి సనన్ మరోసారి తెలుగులో సినిమా చేయకుండా అయిపోయింది. నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో కనిపించినప్పటికి ఆ సినిమా కూడా తనకు పెద్దగా కలిసి రాలేదు. మొత్తానికైతే తెలుగులో తన కెరీర్ ని కోల్పోయిందనే చెప్పాలి…
ఇక ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న శ్రీలాల సైతం ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది. అప్పటినుంచి ఆమె ఏ సినిమా చేసినా కూడా అన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆమెది ఐరన్ లెగ్గానే ముద్రను కూడా వేసేశారు. గుంటూరు కారం సినిమా కంటే ముందు ఆమె ‘ధమాకా’ మూవీతో మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఆ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆమె మహేష్ బాబుతో గుంటూరు కారం చేసిన తర్వాత నుంచే డిజాస్టర్లను ముట్టకట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మహేష్ బాబు వల్లే ఆమె కెరియర్ డౌన్ ఫాల్ అవుతుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…