Senior heroes daughter roles: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్లాప్ లను మూట గట్టుకుంటున్న వాళ్లకు అంతే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక సక్సెస్ తో పది ఆఫర్లు వస్తాయి. అదే ఒక సినిమాతో ప్లాపును మూట గట్టుకుంటే వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మన సీనియర్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకొని ప్రేక్షకుల మన్ననలు పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబు సైతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో అతని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 50 సంవత్సరాల పైబడిన క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో తన కూతురిగా శ్రీలీలా నటించింది… అప్పటికే స్టార్ హీరోలందరితో సినిమాలకు కమిట్ అయింది. అయినప్పటికి శ్రీలీలా బాలయ్య బాబుకు కూతురుగా నటించి మెప్పించింది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా చేయాల్సిన తను బాలయ్య బాబు కూతురుగా నటించడంతో కొంతమంది దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి – బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో చిరంజీవి కూతురుగా ‘చాంపియన్’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘అనస్వర రాజన్’ బాబు సినిమాలో చిరంజీవి కూతురుగా నటిస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి 50 సంవత్సరాలు పైబడిన వయసులో ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. చిరంజీవి మార్క్ ఈ సినిమాలో కనిపిస్తుందట. ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని చూపించడానికి దర్శకుడు బాబీ సైతం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అనస్వర రాజన్ మీదనే ఈ సినిమా స్టోరీ మొత్తం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
తన పాత్రకి ప్రాముఖ్యత ఉందని తెలుసుకున్న తను ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీద వెళ్ళబోతుంది. ఈ సినిమా విషయంలో చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. అనస్వర రాజన్ కి కూడా ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇదంతా చూసిన కొంతమంది సినిమా మేధావులు మాత్రం అటు శ్రీలీలా ఇటు అనస్వర రాజన్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్స్ గా చేయాలనే ఇంట్రెస్ట్ తో వస్తే సీనియర్ హీరోల కూతుర్లుగా పెడుతున్నారు. దీనివల్ల వాళ్లకు స్టార్ హీరోలా పక్కన సినిమాలు చేసే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతున్నాయంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…