Star heroes: పెళ్లి.. ఈ రెండు అక్షరాలు రెండు హృదయాలతో పాటు రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. కొత్త తరాలకు నాంది పలుకుతుంది. అందుకే, స్థిరమైన, శాశ్వతమైన బందానికి వివాహాన్ని ఒక సామాజిక బాధ్యతగా పరిగణిస్తారు. పైగా, పెళ్లి ఒక్కటే భార్యాభర్తల మధ్య శాశ్వత బంధం. పెళ్లి ఒక్కటే.. ఇద్దరు వ్యక్తులు ఐక్యమయ్యే స్థితికి నిజమైన ఆధారం.

అందుకే, మనిషికి పెళ్ళి అత్యవసరం అన్నారు మన పూర్వికులు. అయితే, వెండితెర పై తమ నటనతో ప్రేక్షకులను మెప్పించే నటీనటులు కొంతమంది పెళ్లి కలిసిరాక విడాకుల తీసుకుని విడిపోయారు. మరి వాళ్లెవరు ? వాళ్లెందుకు విడిపోయారో చూద్దాం.
లోక నాయకుడు కమల్ హాసన్ :
కమల్ హసన్ కి 24 సంవత్సరాల వయసులోనే పెళ్లి అయింది. నర్తకి వాణి గణపతిని కమల్ పెళ్లి చేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల కారణంగా కమల్ విడాకులు తీసుకుని భార్య నుండి విడిపోయారు. ఆ తర్వాత కమల్ హాసన్ మరియు నటి సారికాను వివాహం చేసుకున్నారు. కానీ 2002 లో కమల్ ఆమె నుండి కూడా విడిపోయారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ :
పవన్ కల్యాణ్, తన మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత హీరోయిన్ రేణూదేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ :
స్టార్ అవ్వాల్సిన మంచు మనోజ్ కొన్ని కారణాల కారణంగా హీరోగా రాణించలేకపోయాడు. ఆ అపజయమే మనోజ్ పర్సనల్ లైఫ్ పై పడింది. మనోజ్ తన భార్య ప్రణీత రెడ్డితో విడిపోయాడు.
సుమంత్ :
అక్కినేని హీరో సుమంత్ కూడా తన భార్య కీర్తి రెడ్డితో విడిపోయాడు. వీరిది ప్రేమ వివాహం. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. సుమంత్ తో విడాకులు అనంతరం కీర్తి రెడ్డి మళ్ళీ పెళ్లి చేసుకుంది.
అక్కినేని నాగార్జున :
నాగార్జున అక్కినేని డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల కారణంగా నాగార్జున ఆమెకు విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత అమలను ప్రేమ వివాహాం చేసుకున్నారు.
నాగచైతన్య-సమంత:
నాగచైతన్య సమంతను 2017లో వివాహం చేసుకున్నాడు. కానీ తాజాగా విడాకులు తీసుకోబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చాడు.