KGF
Ameer Khan : అకస్మాత్తుగా నడి రోడ్డు మీద ఒక బిచ్చగాడు వాహనాలకు అడ్డం వెళ్లడం, షాప్స్ లోకి దూరి రచ్చ చేయడం వంటి చేశాడు. జనాలు అతని ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. ఆర్టీసీ బస్సులలో చొరబడి నానా హంగామా సృష్టించాడు. ఎవడ్రా బాబు వీడు ఇంత వయొలెంట్ గా ఉన్నాడు అని అనుకున్నారు. ఇతను కేవలం బిచ్చగాడు మాత్రమేనా?, పిచ్చివాడు కూడానా అని సందేహపడ్డారు. కొంతమంది అయితే అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ చేద్దామని కూడా ప్రయత్నం చేసారు. కానీ అతను వాళ్లకు దొరకలేదు. ఇంతకీ ఎవరు ఈ బిచ్చగాడు, ఒక సాధారణ బిచ్చగాడు ఇలా ప్రవర్తించడం అసాధ్యం, కేవలం యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడని కొంతమందికి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే నిజమైంది. ఇంతకు ఆ బిచ్చగాడి గెటప్ లో ఉన్న స్టార్ హీరో మరెవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్.
బాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అమీర్ ఖాన్ సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో ఆయన రికార్డ్స్ ని బద్దలు కొట్టాలంటే, ఆయన వల్లే సాధ్యం..ఇంకెవ్వరి వల్ల కాదు. ఉదాహరణకు ‘దంగల్’ చిత్రాన్ని తీసుకుందాం. 2100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని ‘పుష్ప 2’ కూడా అందుకోలేకపోయింది. అలా ఉంటుంది అమీర్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. ప్రస్తుతం ఆయన ‘అలీ బాబా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఈ ఏడాది డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అమీర్ ఖాన్ ఇలా వీధుల్లో బిచ్చగాడిలా, వింత వేషంతో తిరిగి జనాలను భయపెట్టడానికి కారణం ఏమిటి అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో తెగ వెతికేస్తున్నారు. అమీర్ ఖాన్ మొదటి నుండి తన సినిమా ప్రొమోషన్స్ ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా మారు వేషాలతో తిరిగేవాడు.
గతంలో అవి సూపర్ గా క్లిక్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడా?, ఆయన కొత్త సినిమాలో ఈ వేషధారణతో కనిపించబోతున్నాడా వంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పూర్తిగా ఆరా తీయగా, అమీర్ ఖాన్ తన కొత్త యాడ్ కి సంబంధించి ఇలా ప్రమోట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ‘కోకో కోలా’ సరికొత్త యాడ్ వీడియో కోసం ఆయన ఈ గెటప్ లో కనిపించబోతున్నాడట. అందుకే జనాల్లో ఇలా మారువేషంతో తిరుగుతున్నాడని, ఆ యాడ్ వీడియోని అందరికి చేరువ చేసే ప్రయత్నం లో భాగంగా ఇలా చేశాడని అంటున్నారు. అయితే యాడ్ వీడియో కోసం ఇంత అవసరమా?, ఇది కాస్త ఓవర్ యాక్షన్ లాగా అనిపించలేదు? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అభిమానులు ఈ యాడ్ వీడియో పై ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు.
To Ye Caveman Amir Khan Tha BC
But Why ? pic.twitter.com/fRgDB6cEhr
— POSITIVE FAN (@imashishsrrk) January 29, 2025