
మిస్టర్ పర్ఫెక్ట్ ‘అమీర్ ఖాన్’ ఏమి చేసినా పర్ఫెక్ట్ గానే ఉంటుంది అంటూ బాలీవుడ్ లో అమీర్ కి మంచి పేరు ఉంది. ఇప్పుడు తన పేరును మరింత పెంచడానికి వచ్చినట్టు ఉంది అమీర్ కూతురు ‘ఐరా ఖాన్’. తాజాగా ‘ఐరా ఖాన్’ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఇంట్రెస్ట్ తో ఉండండి’ అంటూ ఒక క్యాప్షన్ పెట్టి.. ఒక మినీ స్టోరీని షేర్ చేసి ఆకట్టుకుంది.
ఈ యంగ్ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ‘ఐరా ఖాన్’ ఏమి షేర్ చేసిందంటే.. తనకు వయసు రాగానే.. అంటే టీనేజ్ లోకి రాగానే తన తల్లి, ప్రముఖ సినిమా నిర్మాత ‘రీనా దత్తా’ తనకు సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చిన విషయాన్ని మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేసింది.
ఉన్నట్టు ఉండి ‘ఐరా ఖాన్’ ఈ విషయాన్ని ఎందుకు గుర్తుచేసుకుందో అర్ధం కాలేదు గాని, మొత్తానికి ఇలాంటి విషయాన్ని పోస్ట్ చేసే దైర్యం తనకు రావడానికి కారణం మాత్రం తన తండ్రి అమీర్ అని చెప్పుకొచ్చింది. ఇక ‘ఐరా ఖాన్’ తానూ షేర్ చేసిన స్టోరీలో ఒక మెసేజ్ కూడా ట్యాగ్ చేసింది. ఆ మెసేజ్ ఏమిటంటే.. ‘నన్ను నేను పూర్తిగా పరీక్షగా ఇంతకుముందు చూసుకోలేదు.
నేను టీనేజ్ లోకి రాగానే మా అమ్మ ఒక సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చి, అద్దంలో నిన్ను నువ్వు పూర్తిగా చూసుకో అంటూ కొన్ని విషయాలు చెప్పింది. అయితే. నేను అలా చేయలేదు. కానీ, నాకు ఆ సమయంలో నాకు అర్థం అయింది. నా శరీరం చాలా మార్పులకు గురైందని’ అంటూ ఐరా ఖాన్ రాసుకొచ్చింది.