Site icon OkTelugu

Chiranjeevi Upcoming Movies: చిరంజీవి లైనప్ లోకి చేరిపోయిన స్టార్ డైరెక్టర్స్..

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు చిరంజీవి… గత 50 సంవత్సరాల నుంచి ఆయనే ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. డ్యాన్సులు, ఫైట్ లలో వైవిధ్యాన్ని చూపించిన చిరంజీవి ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ లోనే కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి భారీ విజయాలను సాధించడంలో మాత్రం డీలా పడిపోతున్నాడు. ఇక దాంతో ఇప్పుడు టాప్ డైరెక్టర్లతో లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది… ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని కోసమే చాలామంది దర్శకులను తన లైనప్ లోకి తెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పటికే బాబీ తో సినిమా చేస్తున్న ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీళ్లిద్దరితో పాటుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట…

అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలైతే వస్తున్నాయి. తొందరలోనే వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నాయి… ఇండస్ట్రీ కి వచ్చిన కుర్రదర్శకులు చిరంజీవి సినిమాలను చూసే ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారు.

కాబట్టి అతనితో సినిమా చేసే అవకాశం వస్తే అతన్ని టాప్ లెవెల్లో చూపించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే సినిమా భారీ విజయాన్ని సాధించి చిరంజీవికి ఎనలేని గుర్తింపుని తీసుకొచ్చే విధంగా సినిమాలను రూపొందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ప్రస్తుతం ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డీలా పడుతున్నాయి. మొత్తానికైతే ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా పడలేదు. కాబట్టి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఒక భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…

Exit mobile version