Junior NTR: ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పై షూటింగ్ స్పాట్ లో, ఒక డైరెక్టర్ అరిచేంత సీన్ ఉందా?, ఎన్టీఆర్ అంత ఛాన్స్ ఇస్తాడా?, రెండవ సినిమాతోనే స్టార్ హీరో అయిపోయాడు, నాల్గవ సినిమాతో సూపర్ స్టార్ అయ్యాడు, 7వ సినిమాతో దాదాపుగా టాలీవుడ్ కి నెంబర్ 1 హీరో రేంజ్ కి ఎదిగాడు, అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పై అరిచేంత సీన్ ఎవరికీ లేదు. కానీ ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వకముందు, అనగా చిన్నతనం లో ‘బాలరామాయణం’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్, గుణ శేఖర్ చిన్న పిల్లలతో చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నానికి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఎన్టీఆర్ కి మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ పై తాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు గుణ శేఖర్.
ఆయన మాట్లాడుతూ ‘బాల రామాయణం షూటింగ్ సమయంలో శివ ధనస్సు ని ముందే విరిచేసాడు ఎన్టీఆర్. అది చూసిన నేను కోపం తో ఊగిపోతూ ఎన్టీఆర్ ని బాగా తిట్టాను. అప్పుడు ఎన్టీఆర్ ఏడ్చుకుంటూ తన తల్లి వద్దకు వెళ్లి నాపై కంప్లైంట్ చేశాడు. ఆవిడ డైరెక్టర్ ఏమి చెప్తే అది, ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే అని చెప్పిందట. అలా చిన్నతనం నుండి ఎన్టీఆర్ ని ఆమె తీర్చిదిద్దిన తీరు అద్భుతం, అందుకే నేడు ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తో దర్శకులకు షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద కష్టమైన సన్నివేశం అయినా, సింగిల్ టేక్ లో డైరెక్టర్ కి శ్రమ పెట్టకుండా, ఆయన కోరుకున్న విధంగా నటిస్తాడు.
ఇలాంటి విషయాల్లోనే ఎన్టీఆర్ దొరికిపోయి తిట్లు తినాల్సి వస్తాది, అలా ఎన్టీఆర్ ని తిట్టే అదృష్టం కేవలం గుణ శేఖర్ కి మాత్రమే దక్కింది. పెద్దయ్యాక రెండవ సినిమాతోనే స్టార్ అయిపోవడం తో ఎన్టీఆర్ పై నోరు పైకి లేపే సాహసం ఎవ్వరూ చేయలేరు, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అంటూ సోషల్ మీడియా లో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్నాడు. అడవుల్లో గత వారం రోజులుగా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడంతో ఎన్టీఆర్ కాస్త అస్వస్థతకు గురి కావాల్సి వచ్చింది.