SSMB29 Movie Update: మహేష్ బాబు(Superstar Mahesh babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుండి కనీసం ఈ సినిమా మొదలైంది అనే విషయం చెప్పలేదు కానీ, కొన్ని కొన్ని విషయాలు ఈ సినిమా గురించి సహజంగానే లీక్ అయిపోతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithvi Raj sukumaran) నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా మరో విలన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తుంది. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. మూడవ షెడ్యూల్ త్వరలోనే విదేశాల్లో జరగనుంది. ఇకపోతే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పృథ్వీ రాజ్ సుకుమారన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలను సోషల్ మీడియా లో మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా తిప్పుతున్నారు. ఇంతకు ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.
Also Read: తమిళ రాజకీయాలను షేక్ చేసే నిర్ణయం తీసుకున్న ధనుష్…
ఆయన మాట్లాడుతూ ‘ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఆలోచన చెయ్యని కథ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే కథలు అన్ని భారీగానే ఉంటాయి. కానీ ఈ సినిమా అంతకు మించి స్పెషల్ అనుకోండి. ప్రతీ ఒక్కరిని అలరించేలా సినిమా తియ్యడం లో ఈ దేశంలో రాజమౌళి ని మించిన డైరెక్టర్ నాకు తెలిసి మరొకరు లేరు. మహేష్ బాబు మాత్రమే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఒక పెద్ద దర్శకుడు కూడా. ఈ ఏడాది ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఎంపురాన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించింది. ఒక దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడి గురించి ఇంత గొప్పగా మాట్లాడడం అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో వస్తుందో అభిమానులు ఊహించుకోవచ్చు.