SSMB 29 Break: మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29కి బ్రేక్ పడింది. మహేష్ బాబు, రాజమౌళి తమ తమ వ్యాపకాల్లో ఉన్నారు. ఇంతకీ SSMB 29 షూటింగ్ కి ఎందుకు విరామం ప్రకటించారో చూద్దాం..
ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో SSMB 29 తెరకెక్కుతుంది. దర్శకుడు రాజమౌళి(RAJAMOULI) దాదాపు రూ. 1000 కోట్లు కేటాయించారని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో(MAHESH BABU) రాజమౌళి చేస్తున్న మొదటి చిత్రం ఇది. ఆర్ ఆర్ ఆర్ అనంతరం రాజమౌళికి గ్లోబల్ ఫేమ్ దక్కింది. దాంతో ఈసారి ఆయన పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో SSMB 29 సెట్స్ పైకి వెళ్ళింది. సెట్స్ లో కొంత షూటింగ్ పూర్తి చేసిన టీమ్, ఒరిస్సా అడవుల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఆఫ్రికా అడవుల్లో సైతం చిత్రీకరణ జరగాల్సి ఉంది.
Also Read: చివరి చిత్రంపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!
SSMB 29 కోసం మహేష్ పూర్తి మేకోవర్ అయ్యారు. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా లాంగ్ హెయిర్, గడ్డంతో మాస్ లుక్ రాబట్టారు. ఇక రాజమౌళి హీరోలు అంటే జిమ్ లో కష్టపడాల్సిందే. గంటల తరబడి జిమ్ లో చెమటోడుస్తున్న మహేష్ బాబు వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యాయి. మహేష్ బాబును రాజమౌళి స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఉత్కంఠ అందరిలో ఉంది. SSMB 29 జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసవీరుడిగా ఉంటుందంటూ హైప్ పెంచేశారు.
2027లో SSMB 29 థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కలవు. అయితే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందన్న వార్త అభిమానులను భయపెడుతుంది. సితార బర్త్ డే వేడుకల కోసం మహేష్ బాబు కుటుంబంతో పాటు శ్రీలంక వెకేషన్ కి వెళ్లాడని సమాచారం. గ్యాప్ రావడంతో హీరోయిన్ ప్రియాంక చోప్రా బహమాస్ తీరంలో భర్త నిక్ జోనాస్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. పని రాక్షసుడిగా పేరున్న రాజమౌళి మాత్రం బాహుబలి: ది ఎపిక్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడని సమాచారం. అయితే ఇది తాత్కాలిక విరామం మాత్రమే. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ లో టీమ్ జాయిన్ కానున్నారు.
రాజమౌళి సినిమా అంటే చెప్పిన సమయానికి విడుదల కావడం కష్టమే. లాక్ డౌన్ తో పాటు పలు అవాంతరాలు ఎదుర్కొన్న ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లోకి రావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. SSMB 29కి మహేష్ బాబు 3 ఏళ్ల సమయం కేటాయించారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంటుందని వినికిడి.