SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఆయన ఫ్రాన్స్ దేశంలోని లియోన్ నగరం లో పర్యటించారు. ఆ నగరం లోని ప్రఖ్యాతి గాంచిన ‘లూమినర్ మ్యూజియం’ ని సందర్శించగా , అక్కడ ఆయనకు అరుదైన సత్కారం లభించింది. మార్టిన్గ్ స్కోర్సెస్ , క్లింట్ ఈస్ట్ వుడ్, క్వేన్టిన్ టొరంటీనో , ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి ప్రపంచ సినిమా ఇండుస్త్రీలను శాసించిన ప్రపంచ దిగ్గజాల పేర్లు ఉన్న గోడపై రాజమౌళి పేరు కూడా శాశ్వతంగా చెక్కబడింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. అక్కడి ప్రేక్షకులు తన #RRR, ఈగ చిత్రాలను బాగా ఆదరించారని , లూమియార్ ఇన్స్టిట్యూట్ , కేన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రిమాక్స్ నన్ను ఎంతో మర్యాదపూర్వకంగా తమ ప్రేక్షకులకు పరిచయం చేయడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన సరప్రైజ్ ని జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రపంచం లో సినిమా పుట్టిన వీధిలో నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. తన చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనలను చూసి చాలా ఎమోషనల్ కి గురయ్యాను అని , ఇక ఆ తర్వాత ప్రపంచం లో ప్రఖ్యాతి గాంచిన దిగ్గజ దర్శకుల మధ్యలో తన పేరు ఉండడం చూసి షాక్ కి గురయ్యాను అని రాజమౌళి వివరించారు . ఇలాంటి గౌరవాన్ని ఇచ్చినందుకు తన నోటి నుండి మాట కూడా రాలేదని , వాళ్లకు కేవలం కృతఙ్ఞతలు మాత్రమే చెప్పగలనని , వాళ్లపై గౌరవంతో మనస్ఫూర్తిగా నా తలవంచి నమస్కరాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, నెటిజెన్స్ తో పాటు గా సినీ సెలబ్రిటీలు కూడా రాజమౌళి కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని మేజర్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయ్యిందని , ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని రాజమౌళి రీసెంట్ గానే చెప్పుకొచ్చారు. ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో , ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం తో పాటు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా నటించబోతున్నారు. ఏప్రిల్ 7 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.
Visited the Lumière Museum and the screening room where Eega and RRR was screened to a full house in Lyon, France.
Thierry Frémaux, the director of the Institut Lumière and the Cannes Film Festival, was gracious enough to introduce me. Then he said he had planned a surprise and… pic.twitter.com/2ZA8UT7Zxf
— rajamouli ss (@ssrajamouli) July 2, 2026

