Srivishnu Single OTT movie views : ఈ ఏడాది బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటి ‘సింగిల్(Single Movie). గీతా ఆర్ట్స్(Geetha Arts) పతాకం పై అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu) నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం లో శ్రీ విష్ణు(Sri Vishnu) హీరో గా నటించగా, కేతిక శర్మ(Ketika Sharma),ఇవానా(Ivana) హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత యూత్ ఆడియన్స్ కడుపుబ్బా ఈ చిత్రాన్ని చూసి నవ్వుకున్నారు. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య వచ్చిన కామెడీ ట్రాక్స్ ఈమధ్య కాలం లో ది బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ఈ సినిమా ఆడుతున్నప్పటికీ అమెజాన్ ప్రైమ్ సంస్థ తో పెట్టుకున్న డీల్ కారణంగా రీసెంట్ గానే అందులో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని దానికంటే ఎక్కువ వచ్చింది. ఇది కదా మేము కోరుకునే ఎంటర్టైన్మెంట్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
థియేటర్స్ నుండి ఈ చిత్రం దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు,ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దాదాపుగా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ చిత్రం ఓటీటీ లో కూడా అదే రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా అనే అనుమానం విశ్లేషకుల్లో ఉండేది. ఎందుకంటే థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచే అన్ని సినిమాలు ఓటీటీ లో హిట్ అవ్వలేదు. కేవలం కొన్ని మాత్రమే అయ్యాయి. అదే విధంగా థియేటర్స్ లో ఫ్లాప్ గా నిల్చిన చిత్రాలు ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇలాంటి పరిణామాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉండడం తో ఈ సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని అనుకునేవారు.
Also Read : సింగిల్’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..లాభాల్లో ఈ ఏడాది ఆల్ టైం రికార్డు!
కానీ అంచనాలకు మించే రెస్పాన్స్ వచ్చింది. మూడు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే వంద మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. చాలా అరుదుగా కొన్ని సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ వ్యూస్ వస్తుంటాయి. అలాంటి మూవీస్ జాబితా లో సింగిల్ చిత్రం నిలబడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. శ్రీ విష్ణు ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు. అందుకే అమెజాన్ ప్రైమ్ సంస్థ పట్టుబట్టి ఆయన సినిమాలను వరుసగా కొంటూ వస్తుంది. శ్రీ విష్ణు గత చిత్రం ‘స్వాగ్’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. శ్రీవిష్ణు ఫిల్మోగ్రఫీ ఒక్కసారి పరిశీలిస్తే ఆయన సినిమాలన్నీ నూటికి 99 శాతం అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల అయ్యాయి.