Bhala Tandanana: వైవిధ్యభరిత కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’. కాగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది.

కాగా పొలిటికల్ టచ్ తో ఉన్న ఈ టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. పైగా ‘భళా తందనాన’ అనే టైటిల్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే, ఇప్పుడు ఈ సినిమా పై బయ్యర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం.. సినిమాలో మంచి మ్యాటర్ ఉందని టాక్ రావడమే.
Also Read: కేసీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం కరెక్ట్ కాదా.. వారికి ఛాన్స్ ఇచ్చేశారే..
కాకపోతే. శ్రీవిష్ణు హీరోగా తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి కూడా ఇలాగే బాగా బజ్ క్రియేట్ అయింది. అయితే, ఆ సినిమా రిలీజ్ అయ్యాక, బ్యాడ్ టాక్ తో బాగా రాడ్ రంబోలా సినిమాగా నిలిచిపోయింది. అసలు ‘అర్జున ఫల్గుణ’ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి ‘అర్జున ఫల్గుణ’ టాక్ చాలా బ్యాడ్ గా వచ్చింది. పైగా ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు.
ఒక విధంగా ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు హీరోగా చేసిన సినిమాల్లోనే ‘అర్జున ఫల్గుణ’ పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. చివరకు పోస్టర్ డబ్బులు కూడా రాలేదు. మరి ఇప్పుడు రానున్న ఈ ‘భళా తందనాన’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: బాలీవుడ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
[…] Also Read: ‘భళా తందనాన’ టీజర్ తో ఆకట్టుకుంటున్… […]