‘శ్రీను వైట్ల’కి తత్వం బోధపడింది !

దర్శకుడు శ్రీను వైట్ల ఫామ్ కోల్పోయాక, హీరోలు నిర్మాతలు కూడా ఆయనను దూరం పెట్టారు. ఒకప్పుడు కమర్షియల్ అంశాలకు మంచి హాస్యాన్ని మేళవించి ప్రేక్షకుల్ని నవ్వించి.. వరుస విజయాలను అందుకున్న ఈ డైరెక్టర్ కి, ఏవరేజ్ హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అంటే.. కచ్చితంగా శ్రీనువైట్లది బ్యాడ్ టైమే. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఇంకా రేసు లోనే ఉన్నాను అంటూ ఇన్ డైరెక్ట్ మేసే లు పాస్ […]

Written By: admin, Updated On : June 15, 2021 9:59 am
Follow us on

దర్శకుడు శ్రీను వైట్ల ఫామ్ కోల్పోయాక, హీరోలు నిర్మాతలు కూడా ఆయనను దూరం పెట్టారు. ఒకప్పుడు కమర్షియల్ అంశాలకు మంచి హాస్యాన్ని మేళవించి ప్రేక్షకుల్ని నవ్వించి.. వరుస విజయాలను అందుకున్న ఈ డైరెక్టర్ కి, ఏవరేజ్ హీరో కూడా డేట్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అంటే.. కచ్చితంగా శ్రీనువైట్లది బ్యాడ్ టైమే.

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఇంకా రేసు లోనే ఉన్నాను అంటూ ఇన్ డైరెక్ట్ మేసే లు పాస్ చేస్తున్నాడు. శ్రీనువైట్లతో సినిమా చేయడానికి ఒక్క ‘మంచు విష్ణు’ మాత్రమే ప్రజెంట్ రెడీగా ఉన్నాడు. ఇప్పటికే వీరి కలయికలో ‘డి అండ్‌ డి’ అంటూ ఓ టైటిల్ ను కూడా సగర్వంగా ప్రకటించారు.

ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెడీ డైరెక్టర్ లాక్‌ డౌన్‌ లో ఏమి చేశాడో చెప్పుకొచ్చాడు. తాను ఈ ఖాళీ సమయంలో ఎక్కువగా కథల పైనే దృష్టి పెట్టానని.. రైటర్స్ తో జూమ్‌లో మాట్లాడుకోవడం, అలాగే ఓటీటీలలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి అప్ డేట్ అవుతూ ఉండటం లాంటివి చేశానని శ్రీను తెలిపాడు. తానూ మూడు కథలను పక్కాగా రెడీ చేశాడట.

ఇక ‘ఢీ’ సినిమాకి ‘డి అండ్‌ డి’ కథకీ ఎలాంటి సంబంధం లేదని, ఓ సహజమైన చిన్న కనెక్షన్‌ మాత్రం ఉంటుందని, ఇక ఢీ’ చూసిన క్షణాలు, ఆ పాత్రలు లీలగా గుర్తుకొస్తాయి అని, తన లైఫ్ లో ‘ఢీ’ సినిమా ఓ మంచి అనుభవం అని, ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ ‘డి అండ్‌ డి’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం అంటూ శ్రీనువైట్ల తెలియజేశాడు.

అన్నట్టు వెబ్‌ సిరీస్‌ ల పై మాత్రం తనకు ఇంట్రెస్ట్ లేదట. సినిమాతో పోలిస్తే వెబ్‌ సిరీస్‌ లు పూర్తిగా వేరు, అలాగే వాటి కంటెంట్‌ కూడా వేరుగా ఉంటుంది. పైగా సినిమాల వల్ల ప్రేక్షకులకు వచ్చే ఫీల్ సిరీస్ ల వల్ల రాదు. అందుకే శ్రీనువైట్ల ఓన్లీ సినిమాలకే పరిమితం అవుతాడట. ఏది ఏమైనా వేదిక ఏదైనా కంటెంట్‌ అత్యుత్తమంగా ఉండాలని ఈ సీనియర్ డైరెక్టర్ కి ఇప్పటికీ తత్వం బోధపడింది.