Srinidhi Shetty: హీరోకి లేని గొప్ప అవకాశం హీరోయిన్ కి ఉంటుంది. ఒక హీరో ఎంత పెద్ద స్టార్ అయినా.. ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ పోవాలి. అన్నీ భాషల్లో అంతే స్టార్ డమ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఏ హీరోకి సాధ్యం కాదు. అదే హీరోయిన్స్ కు ఈ బాధ లేదు. ఓ అరడజను భాషల్లో ఒకేసారి సినిమాలు చేసుకుంటూ రెండు చేతుల్లా డబ్బులు పోగేసుకోవచ్చు. అన్నీ ఇండస్ట్రీలను చుట్టేసి రావొచ్చు.
పైగా ఒక భాషలో ఒక సినిమా హిట్ అయితే.. చకచకా నాలుగు వైపులా నుంచి అవకాశాలు వస్తాయి. పూజా హెగ్డే, రష్మిక లకు ఇలాగే అవకాశాలు వచ్చాయి. వచ్చిన డిమాండ్ కి తగినట్టుగానే వీళ్లు పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఆశ పడుతుంది. కానీ, అది సరిగ్గా సెట్ కావడం లేదు.
‘కేజీఎఫ్ 2’ సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచింది శ్రీనిధి శెట్టి. కానీ, ఆమెకు సినిమాలు రావడం లేదు. శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. దాంతో ఆమె పారితోషికం విషయంలో దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. పాపం.. భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక కూడా పాపకు కలిసి రావడం లేదు.
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. శ్రీనిధి శెట్టిలో ఏమి తక్కువ అంటూ నెటిజన్లు ఆమెకు తెగ సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు గానీ, సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చేవారే లేరు. ఆ మధ్య ఒక జర్నలిస్ట్ శ్రీనిధి శెట్టితో ‘మీకు పేరు కావాలా ? లేక, డబ్బు కావాలా ? అంటూ ఒక ప్రశ్న అడిగారు. ‘నాకు డబ్బే కావాలంటూ మొహమాటం లేకుండా చెప్పింది.
డబ్బు కోసం శ్రీనిధి శెట్టి ఇంతలా పరితపిస్తుంటే.. ఆమెను ఎవరూ సంప్రదించడం లేదు. అన్నట్లు శ్రీనిధి శెట్టి లైగర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తల్లో కూడా వాస్తవం లేదు. సలార్ సినిమాలో అమ్మడు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలోనూ నిజం లేదు అని తేలిపోయింది.
Also Read:Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్