Srinidhi Shetty : తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి, తెలుగు మాట్లాడుకుంటే ముఖ్యమైన ఈవెంట్స్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఫోజులు కొట్టే హీరోయిన్స్ ని మనం చాలామందిని చూస్తూ వచ్చాము. కానీ పక్క రాష్ట్రం నుండి వచ్చే కొంతమంది హీరోయిన్స్ మన తెలుగు మీద ఇష్టం తో, తెలుగు నేర్చుకొని స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ఒక్కరు. కేజీఎఫ్ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి రాకముందు శ్రీనిధి శెట్టి ఒక అడుతమైన విద్యార్థి. పదవ తరగతి లో 93 శాతం మార్కులు వచ్చాయి. కాలేజీలో కూడా టాపర్. అలాంటి అమ్మాయి మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి మిస్ కర్ణాటక కిరీటాన్ని కూడా అందుకుంది. అలా పాపులారిటీ ని సంపాదించిన ఈమె మొదటి సినిమాతోనే ప్రభంజనం సృష్టించింది.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్..ట్రెండ్ ఎలా ఉందంటే!
ఇకపోతే తెలుగు లో ఆమె నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో కలిసి ‘హిట్ 3′(Hit : The Third Case) చేసింది. ఇదే ఆమె మొట్టమొదటి చిత్రం అట. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథి గా విచ్చేశాడు. ఈ ఈవెంట్ మొత్తం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో జరిగింది. అందరు చాలా చక్కగా మాట్లాడారు కానీ, శ్రీనిధి శెట్టి మాట్లాడిన మాటలు మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇది ఆమెకు మొట్టమొదటి తెలుగు సినిమా. అయినప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తెలుగు ని స్పష్టంగా నేర్చుకుంది. నేర్చుకోవడమే కాదు, ఈ సినిమాకు తెలుగు లో డబ్బింగ్ కూడా చెప్పిందట. ఈ కాలం లో ఎంతమంది ఇలా ఉంటారు చెప్పండి.
నిన్న ఆమె దాదాపుగా 10 నిమిషాలు మాట్లాడింది. ఈ పది నిమిషాల్లో ఆమె ఎక్కువ శాతం తెలుగు మాట్లాడడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఆమె ఏమి మాట్లాడింది అని చెప్పడం కంటే, మీ చెవులతో మీరే వినడం బెస్ట్. కచ్చితంగా ప్రతీ ఒక్కరు చూడాల్సిన స్పీచ్ ఇది. ఆమె తెలుగు మాట్లాడేటప్పుడు మధ్యలో కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే వచ్చాయి కానీ, ఓవరాల్ గా సూపర్ అనిపించింది. ఇక సినిమాలో ఆమె తెలుగు డిక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. డైరెక్టర్ శైలేష్ ఆమె తెలుగు ని సహజత్వానికి దగ్గర ఉండేలా డబ్బింగ్ చెప్పించడం లో సక్సెస్ అయ్యాడట. కన్నడ అమ్మాయి అవ్వడంతో తెలుగు నేర్చుకోవడానికి ఈమెకు ఎక్కువ సమయం కూడా పెట్టలేదట.
Also Read : నాని హిట్ 3 సెన్సార్ రిపోర్ట్, వాళ్లకు నో ఎంట్రీ!