https://oktelugu.com/

Srilila : 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో సినిమాలో చెయ్యను అంటూ శ్రీలీల సంచలన కామెంట్స్!

ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోయిన్స్ లో సాయి పల్లవి తర్వాత అద్భుతంగా డ్యాన్స్ వేసేది శ్రీలీలనే. అయితే సాయి పల్లవి కి డ్యాన్స్ తో పాటు నటన కూడా వచ్చు, సినిమాలను కూడా చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటుంది, అందుకే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పర్చుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 08:38 PM IST

    Heroine Srilila

    Follow us on

    Srilila : ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. కాజల్, తమన్నా వంటి హీరోయిన్లు సీనియర్స్ అయిపోయారు, పూజ హెగ్డే, రష్మిక, సమంత వంటి వారు బాలీవుడ్ కి వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్ ఏర్పడిన హీరోయిన్స్ కొరత ని శ్రీలీల చాలా చక్కగా ఉపయోగించుకుంది. యాక్టింగ్ పెద్దగా రాకపోయినా, చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది, డ్యాన్స్ అద్భుతంగా వేస్తుంది కాబట్టి , ఈమెని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు.

    ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోయిన్స్ లో సాయి పల్లవి తర్వాత అద్భుతంగా డ్యాన్స్ వేసేది శ్రీలీలనే. అయితే సాయి పల్లవి కి డ్యాన్స్ తో పాటు నటన కూడా వచ్చు, సినిమాలను కూడా చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటుంది, అందుకే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పర్చుకుంది. శ్రీలీలలో అదే మిస్ అవుతుంది. ముఖ్యంగా ఈ అమ్మాయికి స్క్రిప్ట్స్ ని ఎంచుకునేంత పరిణీతి రాలేదు. అందుకే ‘ధమాకా’ తర్వాత ఈమె చేసిన సినిమాలలో కేవలం ‘భగవంత్ కేసరి’ తప్ప అన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి.

    ఇప్పుడు ఈమె జోరు కాస్త తగ్గింది, కానీ ప్రతీ హీరోయిన్ లాగానే ఈమె కూడా కొన్ని విషయాల్లో ఎంత డబ్బులు ఇచ్చినా చేయకూడదు అని లిమిట్స్ పెట్టుకుంది. అలాంటి వాటిల్లో ఒకటి ఐటెం సాంగ్స్ చేయడం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఐటెం సాంగ్ చేయను అని ఒక గీత గీసుకుంది. దానికి తగ్గట్టుగానే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం ఐటెం సాంగ్ చేయమని రిక్వెస్ట్ వస్తే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసింది. భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా, వంద కోట్లు ఇచ్చిన నేను ఐటెం సాంగ్స్ చేయను అని చెప్పుకొచ్చింది. అంత పెద్ద మాట అన్న ఈమె, ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప 2 : ది రూల్’ లో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కాసేపటి క్రితమే మేకర్స్ ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసారు.

    విజయ్ లాంటి సూపర్ స్టార్ అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా చేయను అని చెప్పిన ఈమె,ఇప్పుడు అల్లు అర్జున్ అడిగిన వెంటనే ఒప్పుకోవడం వెనుక కారణం ఏమిటి..?, అల్లు అర్జున్ మీద ఉన్న విపరీతమైన ఇష్టం కారణంగానా?, లేకపోతే వేరే ఏదైనా కారణమా..?, విజయ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని శ్రీలీల అనుకుందా?,ఇలా ఎన్నో సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో పాటుగా, నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.