Srikanth- Ooha: టాలీవుడ్ లో ‘మేడ్ ఫర్ ఈచ్ అధర్’ అని అనిపించుకున్న జంటలన్నీ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా మారిన వారిని ఎంతోమందిని ఇటీవల కాలం లో మనం చూసాము.. వాళ్లలో ముందుగా మనం సమంత – నాగ చైతన్య జంట గురించి చెప్పుకోవాలి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది క్రితం విడాకులు తీసుకోవడం టాలీవుడ్ లో పెద్ద చర్చకి దారి తీసింది.. వీళ్ళ తర్వాత కోలీవుడ్ టాప్ హీరో ధనుష్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ వచ్చారు.

ఇప్పుడు ఈ జాబితా లోకి శ్రీకాంత్ – ఊహా జంటలు కూడా చేరాబోతున్నట్టు గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో శ్రీకాంత్ తొలుత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి చిన్నగా హీరో పాత్రలు చేసుకుంటూ తన కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికి సినిమాల్లో రాణిస్తూనే ఉన్నారు.. యూత్ మరి కుటుంబ కథా చిత్రలతో శ్రీకాంత్ కి లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
హీరో గా స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ తనతో కలిసి పలు సినిమాలలో నటించిన హీరోయిన్ ఊహ ని ఘానంగా అతిరధ మహారధుల సమక్ష్యం లో రెండు దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకున్నారు.. వీళ్లిద్దరికీ ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు కూడా ఉన్నాడు.. కొడుకు రీసెంట్ గా పెళ్లి సందడి అనే సినిమాలు ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమై తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు.

కొడుకు హీరోగా స్థిరపడ్డాడు అని దంపతులు ఇద్దరు ఆనందించేలోపే వీళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలా విషయం లో గొడవలు ఏర్పడినట్టు తెలుస్తుంది.. అది చిలికిచిలికి గాలివానంత అయ్యి విడాకులు తీసుకొనే ఆలోచన వరుకు వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్..మరి పిల్లలకు వీళ్లిద్దరు విడిపోవడం ఏ మాత్రం ఇష్టం లేదు.. పిల్లల కోసమైనా వీళ్లిద్దరు కలిసి ఉంటారా.. లేదా విడిపోతారా అనేది చూడాలి.. గతం లో సోషల్ మీడియలో ఇలాగే ప్రచారమైన జంటలన్నీ విడిపోయాయి.. మరి ఈ జంట కలిసి ప్రయాణిస్తారా మధ్యలోనే ఆపేస్తారా అని సోషల్ మీడియా కథనాలు ప్రచారం అవుతున్నాయి.


