Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ తో ఆయన చేసిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి ప్టాప్ టాక్ ను తెచ్చుకుంది. అయితే మహేష్ బాబు ఏ డైరెక్టర్లను అయితే ఎక్కువగా నమ్ముతాడో అలాంటి డైరెక్టర్లే మహేష్ బాబుకి భారీ ప్లాప్ లని ఇస్తున్నారు.ఇక ఇంతకుముందు దూకుడు సినిమా సక్సెస్ ఇచ్చాడని శ్రీను వైట్ల తో ఆగడు సినిమా చేసాడు అది భారీ ఫ్లాప్ గా మిగిలింది.
అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాతో మంచి సక్సెస్ ని ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలతో చేసిన బ్రహ్మోత్సవం సినిమా కూడా భారీ ఫ్లాప్ ను మిగిల్చింది.ఇక ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ తో చేసిన గుంటూరు కారం సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నప్పటికీ త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబును మోసం చేయడు అని అందరూ అనుకున్నారు కానీ అందరికి శ్షాక్ ఇస్తు త్రివిక్రమ్ కూడా శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల బాటలోనే నడుస్తూ మహేష్ బాబు భారీ ఫ్లాప్ ని ఇచ్చాడు.
అసలు ఇప్పుడు మహేష్ బాబుకి ఏ డైరెక్టర్ ని నమ్మాలో కూడా అర్థం కావడం.లేదు. ఇంతకు ముందు తనకి సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్లని వాళ్ళ కి మళ్ళీ ఛాన్సులు ఇస్తే వాళ్లు మాత్రం ప్రూవ్ చేసుకోవడంలో ఫేలవుతున్నారు అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో డేట్స్ కోసం చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా తమిళ్ డైరెక్టర్లు అయితే మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు అయిన కూడా వాళ్లకు డేట్స్ ఇవ్వకుండా మన తెలుగు డైరెక్టర్లను ప్రిఫర్ చేస్తూ మహేష్ బాబు చాలా నమ్మకం ఉంచుకొని మన వాళ్ళతో సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం మహేష్ బాబుకి భారీ ప్లాప్ లని ఇస్తూ ఉండటం ఆయనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుందనే చెప్పాలి…