Bigg Boss 6 Telugu- Srihan: బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీజన్ విన్నర్స్ గా శ్రీహాన్ మరియు రేవంత్ నిల్చిన సంగతి తెలిసిందే..శ్రీహాన్ కి క్యాష్ ప్రైజ్ రూపం లో 40 లక్షల రూపాయిలు..రేవంత్ కి పది లక్షల రూపాయిలు మరియు పాతిక లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు తో పాటుగా బ్రీజా కారు ని గెల్చుకున్నాడు..అయితే ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరికంటే శ్రీహాన్ కి అత్యధిక పారితోషికం అందినట్టు తెలుస్తుంది.

వారానికి ఆయనకి 50 వేల రూపాయిల లెక్కన ఇచ్చారట..15 వారాలు హౌస్ లో ఉన్నాడు కాబట్టి 7 లక్షల 50 వేల రూపాయిలు దక్కింది..దీనితో పాటుగా ఆయనకి లెన్స్ కార్ట్ కంటెస్ట్ లో గెలుపొందినందుకు గాను ఆయనకి మరో 5 లక్షల రూపాయిలు వచ్చాయి..మొత్తం మీద క్యాష్ ప్రైజ్ కాకుండా అతనికి 12 లక్షల 50 వేల రూపాయలు వచ్చింది..ఇంత మొత్తం నగదు రేవంత్ కి కూడా రాలేదు.

మొత్తం మీద శ్రీహాన్ కి నలభై లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ తో పాటు 12 లక్షల 50 వేల రూపాయిలు కలిపి మొత్తం 52 లక్షల 50 వేల రూపాయిలు దక్కాయి..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ టైటిల్ విన్నర్ అంటూ నాగార్జున ప్రకటించాడు..ఒకవేళ అతను నాగార్జున ఇచ్చిన 40 లక్షల రూపాయల ఆఫర్ కి టెంప్ట్ అవ్వకుండా ఉంది ఉంటే 50 లక్షల క్యాష్ ప్రైజ్ , పాతిక లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ తో పాటుగా పది లక్షల రూపాయిలు విలువ చేసే బ్రీజా కార్ సొంతం అయ్యేది..వీటి వర్త్ విలువ మొత్తం 85 లక్షల రూపాయిలు..వీటితో పాటుగా 7 లక్షల 50 వేల రూపాయిల పారితోషికం మరియు అదనపు 5 లక్షల రూపాయిల తో కలిపి 92 లక్షలు దక్కేవి..అలా చిన్న టెంప్టింగ్ ఆఫర్ శ్రీహాన్ కి 30 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.