Bigg Boss 6 Telugu Srihan- Sri Satya: గడిచిన బిగ్ బాస్ సీజన్స్ లో లవ్ ట్రాక్స్ బాగానే నడిచాయి..కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో అలాంటి లవ్ ట్రాక్స్ పెద్దగా పండలేదు..సూర్య – ఆరోహి మరియు సూర్య – ఇనాయ లవ్ ట్రాక్స్ నడపాలని చూసారు కానీ, సూర్య మధ్యలోనే ఎలిమినేట్ అవ్వడంతో లవ్ ట్రాక్స్ కి బ్రేక్ పడింది..అంతకు ముందు అర్జున్ కళ్యాణ్ -శ్రీ సత్యకి వన్ సైడ్ లవ్ ట్రాక్ నడిపాడు.

అతను హౌస్ లో అలాగే కొనసాగుంటే రెండు వైపులా లవ్ ట్రాక్ నడిచే ఛాన్స్ ఉండేదేమో కానీ..అర్జున్ కూడా ఎలిమినేట్ అవ్వడంతో బిగ్ బాస్ లో ప్రేమ పావురాలకు ఇక తావులేదని పేక్షకులు ఫిక్స్ అయిపోయారు..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా శ్రీహాన్ -శ్రీసత్య మరో ట్రాక్ నడిపేందుకు సిద్ధం అవుతున్నారా..? లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో చూస్తుంటే అవుననే చెప్పక తప్పట్లేదు.
ఈరోజు బిగ్ బాస్ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ని కంటెస్టెంట్స్ గెలుచుకునే అవకాశాన్ని కలిపించాడు..ఈ టాస్కు ఆడాలంటే బజర్ బటన్ ని నొక్కి ఒక్కో స్లాట్ ని కొనుక్కోవాల్సి వస్తుంది..అప్పుడే ఈ టాస్కులో పాల్గొనడానికి పోటీదారులు అవుతారు..అయితే ఈ గేమ్ ఆడడం తనకి అంతగా ఆసక్తి లేదని ఆదిరెడ్డి తప్పుకోగా మిగిలిన ఇంటి సభ్యులు ఆడుతారు..ఇక ఈ ప్రోమో చివర్లో ‘ఈ ఏవిక్షన్ ఫ్రీ పాస్ నాకు వాడుతానని చెప్పానా’ అని శ్రీహాన్ అంటాడు.

‘ఈ పాస్ ని నీకు నువ్వు వాడాలనుకున్న..నువ్వు వేరే ఎవరినైనా సేవ్ చెయ్యాలనుకున్న కేవలం ఆ ఒక్క వారమే సేవ్ చెయ్యగలుగుతావ్’ అని శ్రీ సత్య అంటుంది.. అప్పుడు శ్రీహాన్ ‘ఒక్క వారమైన నువ్వు నాతో ఉంటావు కదా..అంటే నువ్వు ఉన్న వేల్యూ లక్ష 50 వేల కంటే అది తక్కువే కదా.. నువ్వు ఉంటాను అంటే నా అమౌంట్ లో కట్ చేసిన నాకు అది ఓకే’ అని అంటాడు..అప్పుడు శ్రీ సత్య సిగ్గు పడుతుంది..ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.
ఇలా శ్రీసత్య ప్రేమలో నిండా మునిగిపోయిన శ్రీహాన్ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ను ఆమె కోసం కూడా వాడుతాననడం.. దానికి సిగ్గుతో శ్రీసత్య ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే వీరి ప్రేమ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పక తప్పదు.