Janhvi kapoor- NTR: ఈ ఏడాది #RRR సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ కి జాతీయ స్థాయిలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో మన అందరికి తెలిసిందే..ఇన్ని రోజులు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్కరికి చేరువ అయ్యాడు..ఆయన పోషించిన కొమురం భీం పాత్రకి నార్త్ ఇండియా లో మంచి గుర్తింపు వచ్చింది..ఇక ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ సినిమా తర్వాత వెంటనే ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..KGF సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకున్న ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా అనగానే కేవలం ఆయన అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా ఇప్పటి నుండే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి..ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న ప్రశాంత్ నీల్, ఆ సినిమా పూర్తి అయినా వెంటనే ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవుతాడట.

Also Read: Geethanjali Heroine Girija:షాకింగ్.. గీతాంజలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి
ఇక ఈ ప్రాజెక్ట్ గురించి అప్పుడే వార్తలు రావడం మొదలైయ్యాయి..ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం..ఇప్పటి వరుకు ఈమె కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు తమ సినిమాలలో హీరోయిన్ గా నటింపచేసేందుకు చాలా ప్రయత్నాలే చేసారు..కానీ ఎందుకో కుదర్లేదు..మొత్తానికి ఎన్టీఆర్ సినిమా ద్వారానే ఆమె టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతుండడం విశేషం..ఇప్పటికే ఈమె బాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది..కానీ అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి..కానీ జాన్వీ కపూర్ కి యూత్ లో మాత్రం క్రేజ్ మాములుగా లేదు..సోషల్ మీడియా లో తనకి సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం ఇవి చూసే యూత్ ఫిదా అయిపోయారు..టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈమె రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారానే టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్న ఈ బ్యూటీ భవిష్యత్తు ఎలా అనబోతుందో చూడాలి..ఈమె తల్లి శ్రీదేవి టాలీవుడ్ ద్వారా వెండితెర కి పరిచయం అయ్యి..ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని ఏలిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆమె తన తల్లి స్థాయి ఇమేజి ని సంపాదించుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Read: Virata Parvam Producers: సాయి పల్లవి పై విరుచుపడిన విరాటపర్వం నిర్మాతలు
[…] Also Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి… […]
[…] Also Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి… […]
[…] Read: Janhvi kapoor- NTR: ఎన్టీఆర్ సినిమాతోనే శ్రీదేవి… Recommended […]