Sri Vishnu : శ్రీవిష్ణు(Sri Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగల్'(Single Movie) మూవీ మే9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రెండు రోజుల క్రితం విడుదల చేసారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో, కచ్చితంగా అదిరిపోయి ఉంటుందని ట్రైలర్ ని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కేతిక శర్మ, ఇవానా నటించారు. అయితే ఈ సినిమాలో శ్రీవిష్ణు శివయ్యా అనే డైలాగ్ ని అనుకరించడం పై కన్నప్ప మూవీ టీం ఫీల్ అయ్యింది. మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa Movie) టీజర్ లో ‘శివయ్యా’ అంటూ చెప్పే డైలాగ్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప టీం ఫీల్ అయ్యారనే విషయం తెలుసుకున్న శ్రీవిష్ణు, కాసేపటి క్రితమే వీడియో ని విడుదల చేసాడు.
Also Read : శంకర్ పల్లి లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య పాటని చిత్రీకరిస్తున్న రాజమౌళి!
ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే మేము సింగిల్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసాము. అయితే మేము ట్రైలర్ లో వాడిన కొన్ని డైలాగ్స్ కి కన్నప్ప మూవీ టీం ఫీల్ అయ్యారని తెలిసింది. తెలిసిన వెంటనే ఈ వీడియో ని చేస్తున్నాము. అది మేము కావాలని చేసింది కాదు, తప్పుగా జనాలకు అర్థం అయ్యింది అనే ఉద్దేశ్యంతోనే ఆ డైలాగ్స్ ని వెంటనే తొలగించడం జరిగింది. అవి సినిమాలో కూడా ఉండవు. మిమ్మల్ని బాధపెట్టాలని చేసిన ఉద్దేశ్యంతో చేసింది మాత్రం కాదు. మా సినిమాలో ఎక్కువగా నేటి జనరేషన్ బాగా అనుసరించే మీమ్స్ కానీ, సినిమా రిఫరెన్స్ లు కానీ, బయట ఏది ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటుందో, అలాంటివి ఉపయోగించాము సినిమాలో, ఆ ప్రక్రియ లోనే చిరంజీవి, బాలయ్య. వెంకటేష్ గారి డైలాగ్స్ ని, అదే విధంగా మా నిర్మాత అల్లు అరవింద్ మీద వచ్చిన జోక్స్ మీద కానీ, ఇలా ట్రెండింగ్ లో ఉన్న అన్నిటి మీద ఒక పాజిటివ్ పద్దతి లో చేసాము’.
‘అలాంటివి మీకు పొరపాటున బాధ కలిగించి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదట ఇలాంటివి ఉండవు. మా సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకే ఫ్యామిలీ గా ఉంటాము కాబట్టి, అప్పుడప్పుడు ఇలాంటి నొచ్చుకునే సంఘటనలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. అంతే కాకుండా మూవీ ప్రొడక్షన్ టీం నుండి కూడా క్షమాపణలు చెప్తూ బహిరంగ లేఖ రాసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే సోషల్ మీడియా లో మాత్రం ఈ అంశంపై మంచు విష్ణు ని నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. శివయ్యా అంటే వచ్చిన నష్టం ఏమిటి?, శివయ్యా అనే పదానికి పేటెంట్ రైట్స్ మంచు ఫ్యామిలీ కొనుగోలు చేసిందా?, ప్రతీ దానికి రాద్ధాంతం చేసి ఎందుకు ఇండస్ట్రీ పరువు తీస్తారు అంటూ మండిపడుతున్నారు.
#single sorry pic.twitter.com/0qid5xWcWQ
— devipriya (@sairaaj44) April 30, 2025