Sri Reddy: మన దేశం లో స్త్రీ ని ఆదిపరాశక్తి గా కొలుస్తూ, దైవం తో సమానంగా చూస్తూ గౌరవిస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఆడవాళ్లను చూసిన తర్వాత స్త్రీ సమాజం సిగ్గు తో తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు మొన్న మాజీ ఎమ్మెల్యే, జబర్దస్త్ రోజా మాట్లాడిన మాటలను మనమంతా చూసే ఉంటాము. ఆమెకు మించిన బూతులు, అవి వింటే చెవుల్లో నుండి నెత్తురు కారాల్సిందే, అలాంటి బాషని ఉపయోగించి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), నారా లోకేష్(Nara Lokesh) వంటి వాళ్ళను వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు శ్రీరెడ్డి(Sri Reddy) ప్రవర్తించిన తీరు అప్పట్లో ఎలా ఉండేదో మనమంతా చూసాము. ఈమె కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు సినీ హీరోలను,తన తోటి స్త్రీలను కూడా వినలేని భాషలో తిడుతూ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసేది. కూటమి అధికారం లోకి వచ్చిన కొత్తల్లో కూడా ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది.
Also Read: ‘కేసరి 2’ మొదటి రోజు వసూళ్లు..పాజిటివ్ టాక్ తో ఇంత తక్కువనా?
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పై ఫైర్ అవ్వడం, ఆ తర్వాత పోలీస్ యంత్రాంగం లో కదలిక రావడం, నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయడం, ఒక్కొక్కరుగా అందరూ అరెస్టులు అవ్వడం వంటివి మొదలయ్యాయో , అప్పటి నుండి శ్రీ రెడ్డి లో భయం మొదలైంది. వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేసింది. అది కూడా సరిపోక పోవడంతో ఒక బహిరంగ లేఖను రాసి, ఇక మీదట ఎప్పుడూ అలా మాట్లాడను అని, నా లాంటి వాళ్ళ నోటి దూలవల్లే వైసీపీ పార్టీ కి ఈరోజు ఈ గత పట్టిందని, నా కుటుంబం లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చాలా భయపడుతున్నారని, దయచేసి నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడుతూ క్షమాపణలు చెప్పింది.
కానీ ఇష్టమొచ్చినట్టు తిట్టేసి క్షమాపణలు చెప్తే సరిపోదు కదా, అలా అనుకుంటే టీడీపీ కార్యకర్త కిరణ్ కూడా మొన్న భారతి గారిని తిట్టి క్షమాపణలు చెప్పాడు, అతన్ని కూటమి ప్రభుత్వం విడిచి పెట్టలేదు కదా, అతనికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా అని కూటమి కార్యకర్తలు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటోళ్లను స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్నందుకు కూటమి పై కార్యకర్తలు ఫైర్ మీద ఉన్నారు. ఇది ఇలా ఉండగా శ్రీ రెడ్డి అరెస్ట్ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ రెడ్డి పై అనేక ప్రాంతాల నుండి కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం పూసపాటి రేగ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఒక కేసు నమోదు కాగా, నేడు పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించగా, ఆమె విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది.
Also Read: సక్సెస్ మీట్ లో అబద్దాలు చెప్పిన నందమూరి కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!