Homeఎంటర్టైన్మెంట్Sreeleela Yoga: శ్రీలీల యోగాసనాలపై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో..

Sreeleela Yoga: శ్రీలీల యోగాసనాలపై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో..

Sreeleela Yoga: సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలపై ట్రోల్స్ , నెగెటివిటీ ఉండడం సర్వసాధారణమే. అయితే కొంతమంది సెలబ్రిటీలపై అవసరం లేని నెగెటివిటీ ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా ట్రోల్ చేయడానికి కొంతమంది రెడీ అయిపోతుంటారు. అలాంటి నెగెటివిటీ ని ఎదురుకుంటున్న వారిలో ఒకరు శ్రీలీల . హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే ఈమె స్టార్ గా మారింది. హిట్స్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా, ఈమెకు సినిమాల్లో ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అదృష్టం బహుశా ఏ హీరోయిన్ కి కూడా ఉండదేమో. కానీ సోషల్ మీడియా లో ఈమె పై నెగెటివిటీ మాత్రం పీక్ రేంజ్ లోనే ఉంటుంది. ఆమెకు డ్యాన్స్ తప్ప అసలు యాక్టింగ్ రాదనీ ఆమె నటించే ప్రతీ సినిమాలోని మైనస్ పాయింట్స్ బయటకు తెస్తే, ఆమె పేరే ముందుకు వస్తుందని , ఇలా ఎన్నో రకాల ట్రోల్స్ వేస్తుంటారు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా , శ్రీలీల ఒక పబ్లిక్ యోగా ఈవెంట్ లో పాల్గొన్నది. అక్కడ ఈమె వేసిన కొన్ని ఆసనాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కొంతమంది నెటిజెన్స్ వెక్కిరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన కొన్ని టాప్ పేజీలు శ్రీలీల పై ట్రోల్స్ వేయడం గమనార్హం. ఈరోజు ఆమె వేసిన యోగాసనాలను వెక్కిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక బాలీవుడ్ పేజీ వేసిన వీడియో కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. శ్రీలీల లాంటి మంచి అమ్మాయి ఇలాంటి నెగెటివిటీ ని ఎదురుకోవడం దురదృష్టం. ఆమె ప్రస్తుతానికి గొప్ప నటి అయ్యుండకపోవచ్చు , కానీ భవిష్యత్తులో నటన పరంగా వేరే లెవెల్ కి వెళ్లొచ్చు కదా , ఇలా నటన పరంగా ట్రోల్స్ ఎదురుకున్న ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు నేడు నేషనల్ అవార్డులను అందుకునే రేంజ్ కి ఎదగలేదా?, దేనికైనా కాలం కలిసి రావాలి అంటూ శ్రీలీల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి శ్రీలీల యోగాసనాలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అందులో వాళ్ళు ట్రోల్ చేసేంత స్టఫ్ ఉందా?, కనీసం మీరైనా మీ అభిప్రాయాన్ని కరెక్ట్ గా చెప్పండి అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల కి సినిమాల పరంగా ఈ ఏడాది కూడా అసలు కలిసిరాలేదు. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా తమిళం లో విడుదలైన ‘పరాశక్తి’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, తెలుగు లో ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఇంకా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఆమె ధనుష్ తో ‘ఓం’ అనే చిత్రం చేస్తుంది , అదే విధంగా బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version