Sreeleela: యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ బర్త్ డే నేడు. ఆమె లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీలీల ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ మూవీలో ఆమె లుక్ ఆసక్తి రేపుతోంది. లంగా ఓణీ కట్టి, కాలి వేళ్ళకు నైల్ పాలిష్ వేసుకుంటున్న శ్రీలీల సూపర్ రొమాంటిక్ గా ఉంది. ఆమె కవ్వించే కళ్ళు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆమె గెటప్ చూస్తుంటే రోల్ పై ఒక అంచనా ఏర్పడుతుంది. శ్రీలీల పల్లెటూరి అల్లరి పిల్ల క్యారెక్టర్ లో కనిపించే అవకాశం కలదు. ఇంకా చెప్పాలంటే హీరో మహేష్ వెంటపడే మరదలి పాత్రలో ఆమె కనిపించే అవకాశం కలదంటున్నారు.
ఈ ఊహాగానాల సంగతి ఎలా ఉన్నా శ్రీలీల లుక్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. శ్రీలీల తన గ్లామర్ తో యూత్ కి గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండదు. అయితే శ్రీలీల ఫార్మ్ లో ఉన్న హీరోయిన్. కాబట్టి ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర రాశాడని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక తెలుగులో శ్రీలీల అరడజను చిత్రాల వరకు చేస్తుంది. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల కీలక రోల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఆమెనే హీరోయిన్. అలాగే బోయపాటి శ్రీను-రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో శ్రీలీల నటిస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. శ్రీలీల హవా పెరిగాక పూజా హెగ్డే, కృతి శెట్టి, రష్మిక మందాన జోరు తగ్గింది.
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! – Team #GunturKaaram ️#HBDSreeLeela ✨
Super @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023