Homeఎంటర్టైన్మెంట్Sreeleela Dance Comments: ఇండస్ట్రీ లో నాతో పోటీపడి డ్యాన్స్ వేసేవాళ్ళు లేరంటూ శ్రీలీల హాట్...

Sreeleela Dance Comments: ఇండస్ట్రీ లో నాతో పోటీపడి డ్యాన్స్ వేసేవాళ్ళు లేరంటూ శ్రీలీల హాట్ కామెంట్స్..

Sreeleela Dance Comments: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఒకరు హీరోయిన్ శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ తర్వాత ‘ధమాకా’ తో తొలి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాల్లో ‘భగవంత్ కేసరి’ తప్ప, మిగిలినవన్నీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అదృష్టం కలిసి రాకనో , ఏమో తెలియదు కానీ , శ్రీలీల కి ఇండస్ట్రీ లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు , వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం లో ఈమె తమిళం లో ‘పరాశక్తి’ అనే చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

అయినప్పటికీ కూడా ఈమెకు ధనుష్ 55 వ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూ లో ‘తనతో సమానంగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు’ అంటూ వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియా లో ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఈ ప్రచారం శ్రీలీల వరకు చేరడం తో ఆమె వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది. కొందరు నా మాటలను తప్పుగా అర్థం చేసుకొని ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేశారని, తనది అలాంటి మనస్తత్వం కాదని , మా అమ్మ నన్ను అలా పెంచలేదని , తోటి వారిని గౌరవించడమే నాకు తెలుసనీ , దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మకండి అంటూ శ్రీలీల ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. క్లారిటీ ఇచ్చింది కాబట్టి , ఇప్పటికైనా శ్రీలీల పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడుతుందో లేదో చూడాలి.

ఇకపోతే టాలీవుడ్ లో ఏడాదికి కనీసం 5 సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీల చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన తెలుగు చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాకు ఒప్పుకోలేదట. ఎక్కువగా ఇప్పుడు ఆమె తన ఫోకస్ ని తమిళం మరియు హిందీ సినిమాల మీదనే పెట్టింది. మరి అక్కడ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version