Homeఎంటర్టైన్మెంట్Vishnu Vinyasam Teaser: 'ఎగిరి తంతా నీ...' అంటూ బూతులు మాట్లాడిన శ్రీవిష్ణు..'విష్ణు విన్యాసం' టీజర్...

Vishnu Vinyasam Teaser: ‘ఎగిరి తంతా నీ…’ అంటూ బూతులు మాట్లాడిన శ్రీవిష్ణు..’విష్ణు విన్యాసం’ టీజర్ లో నవ్వులే నవ్వులు!

Vishnu Vinyasam Teaser: విభిన్నమైన కథాంశాలతో యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న శ్రీవిష్ణు(Sree Vishnu), ఇప్పుడు లేటెస్ట్ గా ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) అనే మూవీ తో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా లోని ఒక పాట ఇప్పటికే బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ ని విష్ణు వేరే విధంగా ఉపయోగించాడు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆ షాట్ ని ఒక రేంజ్ తిప్పారు నెటిజెన్స్. అప్పటి నుండే ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఆసక్తి రేగింది. పైగా శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమా చేస్తున్నాడు అంటే, కచ్చితంగా అంచనాలు వేరే లెవెల్ లో ఉండడం సహజం. అలా ఈ సినిమా మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.

అందరూ ఊహించినట్టుగానే శ్రీవిష్ణు మార్క్ పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ తో ఈ టీజర్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఇందులో హీరోయిన్ గా నయన శారికా నటించింది. గతం లో ఆమె ‘ఆయ్’ వంటి సూపర్ హిట్ చిత్రం లో నటించింది. ఇందులో ఆమె చాలా బోల్డ్ క్యారెక్టర్ చేసింది. హీరో తో కలిసి మందు కొట్టడం, సిగరెట్ తాగడం వంటివి చేయడమే కాకుండా, అతనితో లిప్ లాక్స్, రొమాన్స్ వంటివి చేస్తుంది. టీజర్ చివర్లో భీభత్సమైన ట్విస్ట్ ఇస్తూ, హీరో ని నాకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తావా ప్లీజ్ అని అడగడం హైలైట్ గా నిల్చింది. హీరో తో చెయ్యాల్సినవన్నీ చేసి, మళ్లీ అతన్నే తనకు పెళ్లి చెయ్యమని అడగడం ఏంటి?, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదూ, అసలు ఏమి జరిగింది, చివరికి ఏమైంది అనేది తెలియాలంటే ఈ నెల 28 వరకు ఎదురు చూడక తప్పదు.

చివర్లో శ్రీ విష్ణు హీరోయిన్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ ప్రపంచం లో ఇంతమంది ఉండగా, నన్నే ఎందుకు తగులుకున్నావ్’ అని అంటాడు. అందుకు హీరోయిన్ ‘నువ్వు హీరో మెటీరియల్ విష్ణు’ అని అంటుంది. అప్పుడు విష్ణు కౌంటర్ గా ‘ఎగిరి తంతా నీ యక్కా’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిల్చింది. ఓవరాల్ గా శ్రీ విష్ణు నుండి మరో ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చేస్తుంది. కచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని ఈ టీజర్ ఇచ్చేసింది. ఈ సినిమా విడుదలైన రోజున, శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ్’ కూడా విడుదల కాబోతుంది. రెండిట్లో ఏ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కుతుందో చూడాలి. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ‘విష్ణు విన్యాసం’ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

 

Vishnu Vinyasam - Official Teaser | Sree Vishnu | Yadunaath Maruthi Rao | Radhan

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version