Samajavaragamana Closing Collections: సినిమా విడుదలకు ముందు ఒక చిన్న సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే కచ్చితంగా పాటల్లో కనీసం ఒక్కటి అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. లేకపోతే అసలు ఆ చిత్రం హైప్ క్రియేట్ అవ్వదు, విడుదల తర్వాత సినిమాకి టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ రావు. ఒక చిన్న సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్ కూడా రాకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద మనుగడ చాలా కష్టం.
అలాంటిది ఒక్క సూపర్ హిట్ సాంగ్ లేకపోయినా, హైప్ ఏమాత్రం లేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో దుమ్ము లేపిన చిత్రం శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘సామజవరగమనా’. ‘ఏజెంట్’ చిత్రం చేసి చేతులు కాల్చుకున్న ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, ఈ చిన్న సినిమా ద్వారా పొందిన లాభాలు మామూలివి కాదు. అమెరికా లో కూడా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 11 కోట్ల రూపాయిల షర్ వసూళ్లను సాధించింది అంటే మామూలు విషయం కాదు. అలాగే ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ కలిపి మరో 5 కోట్ల రూపాయిల షేర్ ని దక్కించుకుంది. అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 5 కోట్ల రూపాయిలు మాత్రమే.
లాభాలు 11 కోట్ల రూపాయిల వచ్చాయి. నిర్మాతకి ‘ఏజెంట్’ చిత్రం ద్వారా దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం వచ్చింది. ఆ నష్టం లో కొంత బాగా వరకు ఈ చిత్రం రికవర్ చేసింది. ఇప్పుడే ఇదే నిర్మాత మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ చిత్రం చేసాడు. ఆగష్టు 11 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఈ నిర్మాతకి మేలు చేస్తుందో నష్టం చేస్తుందో చూడాలి.