Spirit Update: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉన్న చిత్రం ‘స్పిరిట్'(Spirir Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. అదే విధంగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ని ఒక్కసారి అలా సందీప్ వంగ విజన్ లోని లుక్ తో చూసేసరికి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పిచ్చెక్కిపోయారు. ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా పడింది, ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలే అని అంతా అనుకున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఇప్పటి వరకు కేవలం 5 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందట. త్వరలోనే డెహ్రాడూన్ లో 15 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేసాడట సందీప్ వంగ. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు, ప్రధాన తారాగణం కూడా పాల్గొనబోతుందని, ఇక అప్పటి నుండి నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ జరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రముఖ కొరియన్ సూపర్ స్టార్ ‘డాన్ లీ’ విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటూ ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సందీప్ వంగ ఈ వార్త నిజమని చెప్పలేదు, అబద్దమని కొట్టి పారేయలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తా అనే వాడు అంతే. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ చిత్రం లో డాన్ లీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. డేట్స్ కేటాయింపు కూడా జరిగినట్టు తెలుస్తోంది.
మార్చి 1న ఆయన క్యారెక్టర్ ని స్పిరిట్ వరల్డ్ లో పరిచయం చేయబోతున్నాడట డైరెక్టర్ సందీప్ వంగ. త్వరలోనే ఈ విషయం పై పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. ఇప్పటికే ఈ చిత్రం లో ఒక విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు మెయిన్ విలన్ రోల్ లో డాన్ లీ కనిపించబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రభాస్ కి తండ్రి క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.