Soumya Rao Body Shaming Controversy: బుల్లితెర స్టార్ హైపర్ ఆది ఇజ్జత్ తీసేసింది జబర్దస్త్ మాజీ యాంకర్. అతనిపై బాడీ షేమింగ్ కి పాల్పడింది. గతంలో హైపర్ ఆది ఆమెను వేధింపులకు గురి చేశాడన్న ఆరోపణలు నేపథ్యంలో రివేంజ్ తీర్చుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
డాన్స్ రియాలిటీ షోలలో ఢీ చాలా ప్రత్యేకం. రెండు దశాబ్దాలుగా ఢీ మా టీవీలో ప్రసారం అవుతుంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఈ పాప్యులర్ షోని నిర్మిస్తుంది. 19 సీజన్స్ పూర్తి చేసుకున్న ఢీ… లేటెస్ట్ సీజన్ కి రంగం సిద్ధమైంది. ఢీ 20 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఢీ 20(DHEE 20) గ్రాండ్ లాంచ్ ప్రోమో విడుదల చేశారు. హీరోయిన్ రెజీనా కాసాండ్రా జడ్జిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. నందు యాంకర్ గా కొనసాగుతున్నారు. మీ ఫేవరేట్ కంటెస్టెంట్స్ అందరు ఢీ 20లో కంటెస్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. ఢీ 20లో పోటీ పడే డాన్సర్స్ పరిచయం చేశారు.
హైపర్ ఆది మరోసారి ఢీ కి ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు. ఆయన ఢీ 20లో సైతం సందడి చేయనున్నాడు. ప్రోమో చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. తన మార్క్ డైలాగ్ తో హైపర్ ఆది(HYPER AADI) ఎంట్రీ ఇచ్చాడు. గతంలో ఢీ కి జడ్జెస్ గా ఉన్న హీరోయిన్స్ పూర్ణ, ప్రియమణి మీద పంచులు వేశాడు. బుగ్గలు కొరికే పూర్ణ, హగ్గులు ఇచ్చే ప్రియమణి నుండి మనం ఏం నేర్చుకున్నాం.. అంటూ పంచ్ వేశాడు. సెట్ లోని వారందరూ గట్టిగా నవ్వేశాడు. కాగా జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు(SOWMYA RAO) కి ఢీ 20లో యాంకరింగ్ చేసే ఛాన్స్ దక్కింది.
ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆమె హైపర్ ఆదిని టార్గెట్ చేసింది. బాడీ షేమింగ్ కామెంట్స్ తో పరువు తీసింది. ”షో అందంగా ఉండాలని నన్ను తీసుకున్నారు. షో రేంజ్ పెరగాలని హైట్ గా ఉన్న నిన్ను(నందు) తీసుకున్నారు. వెయిట్ పెరగాలని వెయిట్ ఉన్న ఈ పొట్టోడిని(హైపర్ ఆది)ని పెట్టారు” అంది. హైపర్ ఆదిని పొట్టోడు అని బాడీ షేమింగ్ కామెంట్స్ చేసింది సౌమ్యరావు. అందుకు హైపర్ ఆది.. నేను ఉండగా నువ్వెందుకు ఇక్కడ, అన్నాడు. ఇప్పటి దాకా నువ్వు మాట్లాడించే బొక్క అని సౌమ్య తిరిగి పంచ్ వేసింది. దానికి.. ఆపవే గుంటనక్క, అంటూ హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు.
అయితే ఇదంతా షోలో భాగమే అని తెలుస్తుంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ గిల్లికజ్జాలు. కన్నడ అమ్మాయి అయిన సౌమ్యకు తెలుగు అంతగా రాదు. గతంలో ఆమె జబర్దస్త్ యాంకర్ గా చేసింది. అప్పుడు హైపర్ ఆది ఆమెను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. హైపర్ ఆది వేధింపులు తట్టుకోలేకే సౌమ్యరావు జబర్దస్త్ వదిలేశారనే పుకార్లు వినిపించాయి. నిర్మాతలు తనను జబర్దస్త్ నుండి తప్పించారని చెప్పిన సౌమ్య… హైపర్ ఆది వేధించాడన్న ఆరోపణలు కొట్టిపారేసింది. హైపర్ ఆది తనను చాలా సపోర్ట్ చేశాడని చెప్పుకొచ్చింది.