Venkatesh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ భవిష్యత్తులో ఏ హీరో కూడా సంపాదించుకోలేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎవరికైనా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ వస్తే, వెంకటేష్ తో పోల్చి చూస్తారు. అలాంటి ట్రేడ్ మార్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే కాదు, యూత్,మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు కూడా ఆయన ఎన్నో చేసాడు. అవి బ్లాక్ బస్టర్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కూడా. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం చేసాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రొమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఆయన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో కి అతిథిగా విచ్చేశాడు.
ఈ ఎపిసోడ్ లో వెంకటేష్, బాలయ్య మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తన కొడుకు అర్జున్ సినీ రంగ ప్రవేశం గురించి వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేసాడు. బాలయ్య వెంకటేష్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కొడుకు అర్జున్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు?’ అని అడగగా, దానికి వెంకటేష్ సమాధానం చెప్తూ ‘వాడికి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. అమెరికా లో చదువుకుంటున్నాడు. వాడు మాలాగా కాదు, చాలా నెమ్మదస్తుడు’ అని అంటాడు. అప్పుడు బాలయ్య ‘మరి సినిమాల్లోకి వస్తున్నాడా లేదా’ అని అడగగా, దానికి వెంకటేష్ సమాధానం చెప్తూ ‘అప్పుడే తొందరేముంది, రెండు మూడేళ్లు కానివ్వండి ‘ అని సమాధానం ఇచ్చాడు వెంకటేష్.
అంటే 22 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత అర్జున్ ఎంట్రీ ఉండబోతుంది అన్నమాట. ఇప్పటి వరకు వెంకటేష్ తర్వాత దగ్గుబాటి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినవాళ్లు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. రానా దగ్గుబాటి కి నేషనల్ లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది కానీ, ఎందుకో ఆయన కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోలేదు. హీరో రోల్స్ కంటే క్యారక్టర్ రోల్స్ చేయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. మరోపక్క రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ కూడా ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టి డిజాస్టర్ ఫ్లాప్స్ తో చేదు అనుభవాన్ని ఎదురుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ అభిమానులు మొత్తం అర్జున్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. లుక్స్ పరంగా చూస్తే అర్జున్ కి హీరో కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కానీ వెంకటేష్ రేంజ్ లో యాక్టింగ్ చేయగల్తాడా లేదా అనేది చూడాలి. కానీ అర్జున్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ షేక్ అయ్యే రేంజ్ లోనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.