Social Media Matters Of RRR Movie Celebrities: సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉన్నంత ఫాలోయింగ్ మరెవరికీ ఉండరేమో. ఎందుకంటే వారు నిత్యం జనాల్లో అంత క్రేజ్‌ను కలిగి ఉంటారు. అయితే మన టాలీవుడ్‌లో కూడా చాలామంది సెలబ్రిటీలు నిత్యం నెట్టింట్లో సందడి చేస్తుంటారు. కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ స్టార్లకు సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసుకుందాం.
ముందుగా డైరెక్టర్ జక్కన్న విషయానికి వస్తే.. ఆయనకు ఏ డైరెక్టర్‌కు లేనంతమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక హీరోకు ఉన్నంత మంది ఉన్నారు. అయితే ఆయనకు ఫేస్‌బుక్‌లో 7.5మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన ఫేస్‌బుక్‌లో కేవలం కీరవాణిని మాత్రమే ఫాలో అవుతారు. ఇన్ స్టాలో 1.1, ఇక ట్విట్టర్‌లో అయితే 5.7మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రామ్ చరణ్‌కు బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయనకు 12మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇన్ స్టాలో 5.2మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్ లో అయితే 2మిలియన్ల మంది ఆయన్ను అనుకరిస్తున్నారు. ఇక వీరి తర్వాత తారక్ చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
Also Read: ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న ‘రామారావు’

ఆయనకు ఫేస్‌బుక్‌లో 5.7మిలియన్ల మంది అనుకరిస్తుండగా.. ట్విట్టర్ లో 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్ స్టాలో 3.6మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వీరందరికంటే ఎక్కువగా ఆలియా భట్ కు ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 21.3మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఇన్ స్టా గ్రామ్‌లో 61.4మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్‌లో అయితే 8.5మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఒలీవియా మోరిస్‌కు కూడా సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 62వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాలో లక్షమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా మన త్రిపుల్ ఆర్ టీమ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.
Also Read: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’
Recommended Video:
[…] […]
[…] RRR Pre Release Business: హీరోల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు… రాజమౌళి మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఒక్క ఇండియా ఏంటి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ చూస్తుంటే.. బాక్సులు బద్దలైపోవడం ఖాయం అని అంటున్నారు. […]
[…] Sundaram Master Passed Away: ముగుర్ సుందర్.. ‘డాన్స్ మాస్టర్ సుందరం’గా, ‘సుందరం మాస్టర్’ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. దక్షిణ భారత చలన చిత్రంలో ప్రముఖ నృత్య కొరియోగ్రాఫర్ ఆయన. వివిధ దక్షిణ-భారత చిత్రాలకు 10,000 కంటే ఎక్కువ నృత్య సన్నివేశాలకు దర్శకత్వం వహించిన రికార్డు ఆయన సొంతం. డ్యాన్స్ మాస్టర్ సుందరం కర్ణాటకలోని మైసూర్ జిల్లాలోని ముగూర్ అనే గ్రామంలో జన్మించారు. […]