Naga Chaitanya: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో చందూ మొండేటి ఒకరు. కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలతో అతడు పరిశ్రమను ఆకర్షించాడు. ఆయన గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. హీరో నిఖిల్ కి మరపురాని విజయం దక్కింది. కార్తికేయ 2 హిందీలో ముపై కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం విశేషం. మరి ఇలాంటి దర్శకుడు నుండి నెక్స్ట్ ఎలాంటి చిత్రం రాబుతుందనే ఉత్కంఠ ఉంది. చందూ మొండేటి హీరో నాగ చైతన్యతో ప్రాజెక్ట్ ప్రకటించారు.
ప్రకటనతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించింది. గీతా ఆర్ట్స్ అంటే సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. సాయి పల్లవి హీరోయిన్ గా జాయిన్ కావడం మరింత హైప్ తెచ్చింది. ఇటీవల యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్ర టైటిల్ తండేల్ అని ఫిక్స్ అయ్యారట. తండేల్ అంటే బోటు నడిపేవాడని అర్థం.
నాగ చైతన్య మత్స్యకారుడిగా, బోటు నడిపే వ్యక్తిగా కనిపిస్తారట. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఊహించని మలుపులు, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా నాగ చైతన్య భాగం అవుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామాన్ని ఇటీవల సందర్శించారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారట.
ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్ర బడ్జెట్ రూ. 80 కోట్లు అట. నాగ చైతన్య మార్కెట్ కి ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. నాగ చైతన్య సూపర్ హిట్ చిత్రాలు రూ. 40 కోట్ల షేర్ అందుకున్న దాఖలాలు లేవు. బడ్జెట్ విషయంలో పక్కాగా ఉండే అల్లు అరవింద్ అంత బడ్జెట్ పెట్టేందుకు ఎలా ముందుకు వచ్చారనే వాదన మొదలైంది. అయితే కథను నమ్మి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారట. నెట్ఫ్లిక్స్ లో కూడా టై అప్ అవుతున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. నాగ చైతన్య గత రెండు చిత్రాలు పరాజయం పొందాయి.