Chikiri Chikiri Song Lyrics: మన టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు, అప్పుడప్పుడు కొన్ని విషయాలపై చాలా బలంగా నిలబడి తమ గళం వినిపిస్తూ ఉంటారు. అదంతా కేవలం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని సినీ నటులు చేస్తేనే వీళ్ళ గళం వినిపిస్తుంది. అలా కాకుండా పెద్ద స్థాయి వ్యక్తులు అలాంటి కామెంట్స్ చేసినప్పుడు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. పైగా ఎంజాయ్ చేసి నవ్వుకొని పోతారు కూడా. గత రెండు మూడు రోజులుగా నటుడు శివాజీ(Sivaji) హీరోయిన్ దుస్తులపై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడం, దానిపై అనసూయ, మంచు మనోజ్, పాయల్ రాజ్ పుత్, చిన్మయి, ఇలా వరుసగా సినీ సెలబ్రిటీలు పుట్టల్లో నుండి పాములు బయటకు వచ్చినట్టుగా, ఒక్కఓక్కరుగా బయటకు వచ్చి శివాజీ చేసిన కామెంట్స్ ని తప్పుబడుతున్నారు. హీరోయిన్లు పద్దతిగా చీర కట్టుకొని రండి, సామాన్లు కనిపించేలా పొట్టి బట్టల్లో అందం ఉండదు అని శివాజీ చేసిన కామెంట్స్.
మంచి మాటనే చెప్పాడు, కానీ అందులో సామాన్లు అనే పదం ఉపయోగించడం ముమ్మాటికీ తప్పే, అందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. ఇంతకు మించి ఏమి కావాలి చెప్పండి ?, కానీ ఈ వివాదాన్ని పొడిగిస్తునే ఉన్నారు. ‘సామాన్లు’ అనే పదం ఒక అమ్మాయిని ఉద్దేశించి చేయడం తప్పు అయ్యినప్పుడు, రీసెంట్ గానే విడుదలై గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన ‘చికిరి..చికిరి’ పాటలోని లిరిక్స్ లో గొప్ప అర్థాలు ఉన్నాయా ఏంటి?, సోషల్ మీడియా లో నెటిజెన్స్ మొత్తం లక్షల్లో రీల్స్ చేస్తూ కూర్చున్నారు?, ఆ పాటలో ‘సరుకు..సామాన్లు చూసి వెనకే పడతా’ అంటూ వచ్చే లైన్ కి మీనింగ్ ఏంటో చిన్మయి లాంటోళ్లకు అర్థం కాలేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చిన్మయి ని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు. నిజమైన ఫెమినిస్ట్స్ చిన్న వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు ఒకలాగా, పెద్ద వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు మరొకలాగా ఉండకూడదు . ఎవరికైనా సమానంగానే స్పందించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకా సాగదీస్తారా?, లేదా ఇక్కడితో ఆపేస్తారా అనేది.
RC got a free pass to use sammanlu pic.twitter.com/vYmgzMOB6Q
— PraCash️ (@PraCashVK18) December 23, 2025