Singer Revanth: సింగర్ రేవంత్ ఇంట్లో పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఆయన తండ్రి అయ్యారు. రేవంత్ భార్య అన్విత పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. డిసెంబర్ 2 తెల్లవారుఝామున అన్వితకు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది. అన్వితకు అమ్మాయి పుట్టిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సింగర్ రేవంత్ అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు.
రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 లాంచింగ్ ఎపిసోడ్ నాడు అన్విత రేవంత్ తో పాటు వేదికపైకి వచ్చింది. దగ్గరుండి రేవంత్ ని హౌస్లోకి పంపింది. రేవంత్ హౌస్లోకి వెళ్లబోయే ముందు ఒక టాస్క్ కూడా ఆడించాడు. తన భార్య కళ్ళను గుర్తుపట్టాలని అడిగాడు. ఈ టాస్క్ లో రేవంత్ ఫెయిల్ కావడం విశేషం. చిరు కోపానికి గురైన భార్యను శాంతింపజేయడానికి ఒక పాట కూడా పాడాడు.
హౌస్లో ఉన్న రేవంత్ కోసం అన్విత సీమంతం వీడియోను బిగ్ బాస్ ప్రదర్శించాడు. అలాగే ఫ్యామిలీ వీక్ లో అన్వితతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అయితే వీడియో కాల్ మధ్యలో కట్ అయ్యింది. రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కాగా రేవంత్ అమ్మాయినే కోరుకున్నాడు. కోరుకున్న ప్రకారం రేవంత్ కి అమ్మాయి పుట్టింది. మరి ఈ విషయాన్ని బిగ్ బాస్ రేవంత్ కి ఎలా చెబుతాడో చూడాలి.
కాగా మరో రెండు వారాల్లో బిగ్ బాస్ షో ముగియనుంది. ఇంటిలో 8 మంది సభ్యులు ఉన్నారు. వారి నుండి ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. 5 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారు. ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, ఫైమా, కీర్తి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. మరి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చనే ప్రచారం జరుగుతుంది. దీంతో కీలక సమయంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.