Homeఎంటర్టైన్మెంట్Singer Mangli song controversy: పాటలో పచ్చి బూతులు ..సింగర్ మంగ్లీ పై కేసు నమోదు.....

Singer Mangli song controversy: పాటలో పచ్చి బూతులు ..సింగర్ మంగ్లీ పై కేసు నమోదు.. అసలు ఏమైందంటే!

Singer Mangli song controversy: టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి , యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ , ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. కన్నడ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కేడీ : ది డెవిల్’ చిత్రం లో సింగర్ మంగ్లీ పాడిన పాటపై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ పాటకు రాకీబ్ రచయితగా వ్యవహరించగా, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ట్యూన్ ని అందించాడు. ఈ పాటలో అసభ్యకరమైన పదాలు మాత్రమే కాకుండా, అస్లీల దృశ్యాలు కూడా ఉన్నాయని. అవి చూసేందుకు చాలా అసహ్యంగా ఉన్నాయని ముంబై కి చెందిన లాయర్ వినీత్ జిందాల్ CBFC తో పాటు, సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటని మేకర్స్ యూట్యూబ్ నుండి తొలగించారు.

కన్నడ యంగ్ హీరో ‘ధృవ్ సర్జా’ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో రీష్మా నానై హీరోయిన్ గా నటించగా , సంజయ్ దత్ , శిల్పా శెట్టి , నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వివాదాస్పద పాటకు కన్నడ పరిశ్రమ నుండి ఎలాంటి అభ్యంతరం రాలేదు. కేవలం హిందీ వెర్షన్ నుండే ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఈ పాటని తొలగించారని అంటున్నారు. ముఖ్యంగా సింగర్ మంగ్లీ ఈ పాట కారణంగా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మంగ్లీ నుండి ఇలాంటి పాట అసలు ఆశించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మంగ్లీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆమె కచ్చితంగా స్పందించి తీరాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

రీసెంట్ గానే ఈమె పాడిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘బాయిలోనే బల్లి పడితే’ పాత ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడు నెలల క్రితం అప్లోడ్ చేసిన ఈ పాటకు యూట్యూబ్ నుండి 126 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ బ్లాక్ బస్టర్ వ్యూస్ తో ఈ పాట దూసుకెళ్తూనే ఉంది రాబోయే రోజుల్లో ఈ పాట ఇంకా ఏ స్థాయికి వెళ్లబోతుందో చూడాలి. ఇలా ఒక్కటా రెండా ఎన్నో బ్లాక్ బస్టర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి సింగర్ మంగ్లీ తన గాత్రాన్ని అందించింది. అలాంటి ఆమె ఇలాంటి బూతు పాటలు పాడడం అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version