Singer Kalpana
Singer Kalpana: సింగర్ కల్పన రాఘవేందర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సింగర్ కల్పన రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో సింగర్ గా ఉన్నారు. పలు హిట్ చిత్రాలలో పాటలు పాడారు. కల్పన చెన్నైలో పుట్టారు. తెలుగు, తమిళ్ లో ఎక్కువగా పాటలు పాడారు. తెలుగులో కూడా ఆమెకు పాపులారిటీ ఉంది. సింగర్స్ ఫ్యామిలీలో పుట్టిన కల్పన బాల్యం నుండే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది . కెరీర్లో ఆమె 3000 లకు పైగా సాంగ్స్ వివిధ భాషల్లో పాడారు. కఠినమైన సాంగ్స్ కి ఆమె ఛాయిస్ గా మారారు. అందరితో కల్పన చాలా కలిసిపోతారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు.
Also Read: ‘అర్జున్ రెడ్డి’ తర్వాత నేను ఎంతో నరకం అనుభవించాను అంటూ హీరోయిన్ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో కల్పన పాల్గొన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సదరు షోలో కల్పన పెద్దగా రాణించలేదు. 4వ వారమే ఎలిమినేట్ అయ్యారు.
కల్పన పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరించారు. కల్పన కెరీర్లో ఎన్నో విజయాలు చూస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. కల్పన వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. ఒక కూతురు పుట్టాక భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దాంతో విడాకులు తీసుకుంది. కూతురు తనవద్దే పెరుగుతుంది. సింగిల్ పేరెంట్ స్ట్రగుల్స్ గురించి గతంలో కల్పన పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈవెంట్స్, షోస్ వలన ఆమె బిజీగా ఉండటంతో కూతురిని చూసుకోవడం కష్టమైంది. అప్పుడు బంధువుల వద్ద కూతురిని ఉంచాల్సి వచ్చిందట. ఆ సమయంలో లైంగిక వేధింపుల కేసు ఒకటి తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో ఒంటరిగా ఉన్నారని తెలుస్తుంది. ఆమె భర్త చెన్నైలో ఉన్నారట. విషయం తెలిసిన భర్త హైదరాబాద్ కి వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. రెండు రోజులుగా కల్పన ఇంటి నుండి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎంత పిలిచినా ఆమె నుండి స్పందన రాలేదు. దాంతో ఇంటి వెనక డోర్ బ్రేక్ చేసి పోలీసులు లోపలికి ప్రవేశించారు.
తన బెడ్ రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కల్పన నిద్ర మాత్రలు మింగినట్లు వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స జరుగుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గతంలో ఆమె విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. 2010లోనే భర్తతో విడిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె భర్తతో కలిసి ఉంటున్నట్లు, ఘటన సమయంలో ఆయన చెన్నైలో ఉన్నారని పోలీసులు మీడియాతో వెల్లడించారు. ఈ పరిణామాలు అనుమానాలు రేపుతున్నాయి. కల్పన ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్త, అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి..కేవలం 5 నిమిషాల కోసం ఎంత తీసుకుంటుందో తెలుసా?
Web Title: Singer kalpana family details and health update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com