Site icon OkTelugu

Singeetham Movie Twitter Talk: ‘సింగీతం’ మూవీ ట్విట్టర్ టాక్ ఇదే.. ఇలాంటి రివ్యూస్ వస్తాయని కలలో కూడా ఊహించలేదు..

Sing Geetham Movie Collections

Sing Geetham Movie Collections

Singeetham Movie Twitter Talk: టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి , ఆరోజుల్లో తిరుగులేని స్టార్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే మూసలో వెళ్తున్న కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చే ప్రయత్నం చేసిన లెజెండ్స్ లో ఆయన కూడా ఒకరు. ఆరోజుల్లో ఆయన తీసిన ‘ఆదిత్య 369’ గురించి ఇప్పటికీ మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటే , ఆయన విజన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనకు 94 ఏళ్ళు. ఈ వయస్సులో ఇంట్లో కదల్లేని పరిస్థితిలో కూర్చొని , కృష్ణా రామా అని అనుకుంటూ ఉంటారు. కానీ సింగీతం శ్రీనివాస రావు ఈ వయస్సులో కూడా నేటి తరం డైరెక్టర్స్ తో పోటీ పడి సినిమా తీయగలను అని నిరూపించాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘సింగ్ గీతం’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.

‘సింగ్ గీతం’ ఒక విభిన్నమైన సినిమా అని , స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా స్లో గానే ఉంటుంది కానీ , కచ్చితంగా ఒకసారి థియేటర్ లో చూడదగ్గ సినిమా అని అంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్. ఈ సినిమాని సింగీతం మ్యూజిక్ తోనే నడిపించడం ఒక సరికొత్త ప్రయోగమని , కానీ మధ్యలో కాస్త బోరింగ్ ఫీల్ ఇస్తుందని అంటున్నారు. ఇక కామెడీ కూడా అనేక సన్నివేశాల్లో పండింది అని, కానీ సినిమా కోర్ లైన్ సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని. ఫ్లాష్ బ్యాక్ నుండి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా పండాయని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం వెన్నుముక లాంటిదని, ఈమధ్య కాలం లో ఆయన నుండి వచ్చిన బెస్ట్ వర్క్ ఇదేనని అంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ని నేటి తరం ఆడియన్స్ కి అందించాలనే ప్రయత్నం చేసినందుకు సింగీతం శ్రీనివాస రావు , వైజయంతి మూవీ మేకర్స్ కి సెల్యూట్ అని అంటున్నారు నెటిజెన్స్.

ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి నచ్చే జానర్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఈ సినిమా ఎమోషనల్ జర్నీ కచ్చితంగా థియేటర్స్ లో చూస్తూనే అద్భుతమైన అనుభూతి పొందగలం అంటూ చెప్పుకొచ్చారు ట్విట్టర్ ఆడియన్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే VFX షాట్స్ కాస్త బెటర్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది అట. అంతే కాకుండా పాటల ఫార్మటు లో సినిమాని చెప్పించడం అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కూడా కాస్త స్లో గా అనిపించిందని , కొన్ని కామెడీ సన్నివేశాలు బలహీనంగా అనిపించాయని అంటున్నారు.

Exit mobile version