Homeఎంటర్టైన్మెంట్Bihar Elections: ఢిల్లీ పేలుళ్లపై మౌనం.. బిహార్‌ ఎన్నికలపై విమర్శలు.. ఇదో రకం డైవర్షన్‌!

Bihar Elections: ఢిల్లీ పేలుళ్లపై మౌనం.. బిహార్‌ ఎన్నికలపై విమర్శలు.. ఇదో రకం డైవర్షన్‌!

Bihar Elections: ఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో మెట్రో రైల్వే స్షేన్‌ వద్ద నవంబర్‌ 10న జరిగిన బాంబు పేలుడు ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎన్‌ఐఏ విచారణ చేపడుతోంది. దర్యాప్తు కశ్మీర్‌ నుంచి యూపీ, హర్యానా వరకూ విస్తరించగా, పలువురు ముస్లిం మూలం డాక్టర్లు అరెస్టు అయ్యారు. ఆరోగ్యరంగానికి చెందిన విద్యావంతులు ఉగ్రవాద చట్రంలో ఉండడం సమాజానికీ, విద్యావ్యవస్థకీ హెచ్చరిక. కానీ మరింత గమనించదగినది – గతంలో ప్రతి విషయంపైనా ‘‘సిస్టమాటిక్‌ ఇన్టోలరెన్స్‌’’ అంటూ అరిచే లెఫ్ట్‌–లిబరల్‌ వర్గాలు ఇప్పుడు అసహజమైన నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాయి. ప్రమాదం ఎక్కడ? పేలుళ్లను ఖండించడం లౌకికతను దెబ్బతీయదు. కానీ మతపరమైన ఉగ్రవాదం బయటపడినప్పుడు ఈ వర్గాల స్వరాలు మసకబారిపోతాయి. ఈ మౌనం తటస్థం కాదు. అది రాజకీయ ప్రదర్శన. లౌకికతను విలువల స్థాయిలో కాక, ఒక వ్యూహాత్మక ఆయుధంలా వాడటం భారతీయ మేధావులలో కొత్తది కాదు.

బిహార్‌ ఎన్నికలపై విమర్శలు..
బిహార్‌ ఎన్నికలు ఉగ్రవాద దర్యాప్తు కన్నా పెద్దదిగా కనిపించాలంటే, ఆ ప్రయత్నం వెనుక ఉద్దేశ్యం స్పష్టమే. ప్రజల దృష్టి ఢిల్లీ ఘటన నుంచి మరల్చడం. మీడియా చర్చలు ‘‘ఎవరికి లాభం?’’ అనే ప్రశ్న చుట్టూ తిరుగుతూ, పేలుడు వెనుక ఉన్న సాంకేతిక, ఆర్థిక, మానసిక మూలాలపై చర్చించడమే మరిచిపోయాయి. ఈ విస్మరణే ప్రమాదం. సామాజిక చైతన్యం అంటే కేవలం నిర్దిష్ట వైఖరిని సమర్థించడం కాదు. ఒక సమూహం తప్పు చేస్తే నిశ్శబ్దం పాటించడం, మరొక గుంపు తప్పు చేస్తే ఆగ్రహించడం అనేది మేధాస్థాయి నైజం కాదు. ఇది నైతిక అసమతౌల్యం. మతమా, రాజకీయమా అన్న తేడా లేకుండా అన్ని రకాల ఉగ్రవాదం ఒక్కలా ఖండించబడినప్పుడే లౌకికత అర్థవంతమవుతుంది.

ఢిల్లీ ఘటన దేశానికి కేవలం భద్రతా పాఠం కాదు, బహుళవాదాన్ని రక్షించడంలో ఉన్న మన సంస్కార పరీక్ష కూడా. నిజమైన లౌకికవాదం అంటే మతంను అడ్డంలా కాకుండా అద్దంలా చూడగల ధైర్యం. ఈ మౌనం విస్ఫోటన కన్నా ప్రమాదకరం.. ఎందుకంటే అది ఉగ్రవాదానికి లాభం చేకూర్చే సామాజిక సమ్మతి రూపమే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular