Siddharth : వేదికపై ఆమె కాళ్లు పట్టుకొని ఏడ్చిన హీరో సిద్దార్థ్… ఈమె ఎవరు? కారణం ఏంటీ?

ఈ మూవీలో హీరోగా నటించిన సిద్ధార్థ్ కి, ఆ ఆఫర్ ఒకరి వలన వచ్చిందట. ప్రముఖ రచయిత సుజాత రంగరాజన్ వైఫ్ భర్తకు శంకర్ చేయబోతున్న బాయ్స్ మూవీ హీరోగా సిద్ధార్థ్ చక్కగా సరిపోతారని అన్నారట.

Written By: NARESH, Updated On : June 8, 2023 8:36 am
Follow us on

Siddharth : చిత్ర పరిశ్రమ చాలా విచిత్రమైనది. దర్శకులు కావాలనుకున్నవాళ్ళు నటులు, నటులు కావాలనుకున్నవాళ్ళు దర్శకులు అవుతుంటారు. అలా ఒక లక్ష్యంతో పరిశ్రమకు వచ్చి తమ అసలు టాలెంట్ వెలుగులోకి వచ్చి ఆ ప్రొఫెషన్ లో సెటిల్ అయినవాళ్లు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో హీరో సిద్ధార్థ్ ఒకరు. లవర్ బాయ్ ఇమేజ్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సిద్ధార్థ్ దర్శకుడు కావాలనుకున్నాడు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అయితే అనుకోకుండా ఆయన్ని హీరో రోల్ వరించింది.

దర్శకుడు శంకర్ తన శైలికి భిన్నంగా 2003లో యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాయ్స్ చేశారు. ఇందులో కూడా ఆయన మెసేజ్ చెప్పాడు. అయితే పక్కా యూత్ఫుల్ మూవీ అది. టీనేజ్ బాయ్స్ ఆలోచన విధానాలు సిల్వర్ స్క్రీన్ పై శంకర్ ఆవిష్కరించారు. ఈ మూవీలో హీరోగా నటించిన సిద్ధార్థ్ కి, ఆ ఆఫర్ ఒకరి వలన వచ్చిందట. ప్రముఖ రచయిత సుజాత రంగరాజన్ వైఫ్ భర్తకు శంకర్ చేయబోతున్న బాయ్స్ మూవీ హీరోగా సిద్ధార్థ్ చక్కగా సరిపోతారని అన్నారట.

అందుకు సుజాత రంగరాజన్ వద్దు అన్నారట. సిద్ధార్థ్ డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు. హీరోగా ఎందుకు అన్నాడట. కాదు మీరు శంకర్ కి సిద్దార్థ్ గురించి చెప్పండని అన్నారట. శంకర్ కూడా సిద్ధార్థ్ బాయ్స్ చిత్ర హీరోగా సెట్ అవుతాడని భావించారట. సిద్ధార్థ్ ని హీరోగా చేయమని అడగ్గా మొదట తిరస్కరించారట. అయితే శంకర్ జస్ట్ ఒక ఫోటో షూట్ చెయ్, తర్వాత డిసైడ్ చేద్దాం అన్నారట. సిద్ధార్థ్ గురువు మణిరత్నం ఒకసారి ఫోటో షూట్ చెయ్, శంకర్ ఆ చిత్ర హీరోగా నిన్నే ఫిక్స్ అయ్యాడని చెప్పాడట.

ఆ విధంగా సిద్ధార్థ్ బాయ్స్ మూవీతో హీరో అయ్యారు. బాయ్స్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సిద్ధార్థ్ హీరోగా బిజీ అయ్యాడు. రెండు దశాబ్దాలుగా అతని సినిమా ప్రయాణం సాగుతుంది. దీనంతటికీ కారణం సుజాత రంగరాజన్ భార్య. అందుకే తాజాగా ఆమె గురించి మాట్లాడుతూ సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ఆమె కాళ్లకు నమస్కారం చేసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.

https://www.youtube.com/watch?v=sM7X4H50z-A