https://oktelugu.com/

Shyam Singha Roy: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ‘శ్యామ్ సింగరాయ్’.. ఎప్పుడో తెలుసా?

Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘శామ్ సింగ రాయ్’.  2021 డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘శ్యామ్ సింగరాయ్’కు మౌత్ టాక్ బాగా రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్లు వస్తున్నారు. దీంతో చిత్రబృందం హ్యాపీగా ఫీలవుతోంది. గతేడాది నాని నటించిన  ‘వీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. ఈ సినిమా థియేటర్లలో రిలీజు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 8, 2022 / 01:45 PM IST
    Follow us on

    Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘శామ్ సింగ రాయ్’.  2021 డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘శ్యామ్ సింగరాయ్’కు మౌత్ టాక్ బాగా రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్లు వస్తున్నారు. దీంతో చిత్రబృందం హ్యాపీగా ఫీలవుతోంది.

    Shyam Singha Roy

    గతేడాది నాని నటించిన  ‘వీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. ఈ సినిమా థియేటర్లలో రిలీజు కాకపోవడంతో నాని ఫ్యాన్స్ నిరుత్సానికి గురయ్యారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీలోనూ పెద్దగా ఆడలేదని తెలుస్తోంది.  దీంతో హీరో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిజాస్టర్లలో ఉన్న నానికి ‘శ్యామ్ సింగరాయ్’  మూవీ థియేటర్లో విడుదల అవడమే కాకుండా భారీ విజయాన్ని అందించింది.

    నైజాం, ఓవర్సీస్, యూకేలో ‘శ్యామ్ సింగరాయ్’ దుమ్ముదులిపే కలెక్షన్లను రాబడుతోంది. ఈ ఏరియాల్లో ఇప్పటికే ఈ ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లగా ఏపీలో మాత్రం కొంత సమయం పట్టేలా కన్పిస్తోంది. కాగా ఈ మూవీ 50కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. జనవరి 21న నెట్ ఫిక్స్ లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనునున్నట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.