https://oktelugu.com/

Shyam Singha Roy: నాని కెరీర్​లో ఇదే అతిపెద్ద సినిమా అవుతుంది- రాహుల్​

Shyam Singha Roy: టాక్సీవాలా చిత్రంతో చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు “రాహుల్‌ సంకృత్యాన్‌”. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా పై అనుకున్నంత స్పందన లభించలేదు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్లు తెరకెక్కిన చిత్రం “శ్యామ్‌ సింగరాయ్‌”. భారీ అంచనాలతో ఈనెల క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు రాహుల్‌ సంకృత్యాన్‌. టాక్సీవాలా సినిమా తర్వాత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 08:19 PM IST
    Follow us on

    Shyam Singha Roy: టాక్సీవాలా చిత్రంతో చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు “రాహుల్‌ సంకృత్యాన్‌”. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా పై అనుకున్నంత స్పందన లభించలేదు. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్లు తెరకెక్కిన చిత్రం “శ్యామ్‌ సింగరాయ్‌”. భారీ అంచనాలతో ఈనెల క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు రాహుల్‌ సంకృత్యాన్‌.

    టాక్సీవాలా సినిమా తర్వాత చాలా కథలు అనుకున్నా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ కథలు వర్కవుట్ అవ్వలేదు.బెంగాల్‌ నేపథ్యం ఉన్న ఈ కథా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మను. అయితే ఒక సందర్భంలో నాని ని కలిశాను కథలో ఎలాంటి ఎలిమెంట్స్‌ ఉంటే నానికి నచ్చుతాయో అర్థమైంది. అందుకే ఈ కథ అనుకోగానే నానిని కలిశాను ఈ పాత్రలో నాని తప్ప ఇంకెవ్వరినీ ఊహించలేకపోయాను. కథ విన్న తరవాత స్ర్కిప్టు తయారు చేయ్‌ అన్నారు.మూడు నెలల సమయం తీసుకుని బౌండెడ్‌ స్ర్కిప్టుతో ఆయన దగ్గరకు వెళ్లానూ అలా ఈ సినిమా మొదలైంది.

    మొదటి భాగంలో “వాసు” అనే పాత్రలో అలరిస్తారు నాని. ఈ పాత్రలో కావల్సినంత వినోదం వినోదాన్ని అందిస్తారు. ఆ తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌ కనిపిస్తాడు. వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది.ఈ సినిమా లో నాని రకరకాల గెటప్పుల్లో కనిపిస్తారు.ఓ రకంగా నాని కెరీర్‌లోనే ఇది అతి పెద్ద సినిమాగా “శ్యామ్‌ సింగరాయ్‌” ని చెప్పుకోవచ్చు. హిందీలో తప్ప మిగిలిన భాషల్లో ఈ చిత్రాన్ని డబ్‌ చేశాం. హిందీలో ఈ సినిమాను రీమేక్‌ చేస్తారన్న నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు రాహుల్‌ సంకృత్యాన్‌.