Shweta Basu Prasad: ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది శ్వేతా బసు ప్రసాద్. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన కొత్త బంగారు లోకం అప్పట్లో ట్రెండ్ సెట్టర్. వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. సందేశంతో కూడిన ప్రేమ కథ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. సినిమాకు శ్వేతా నటన హైలెట్. టీనేజ్ కాలేజ్ గర్ల్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఎక్కడా… అంటూ ఆమె చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్.
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. రైడ్, కాస్కో, కళావర్ కింగ్ అంటూ పలు చిత్రాలు చేసింది. అయితే కొత్త బంగారు లోకం వంటి హిట్ మరలా పడలేదు. దాంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈ దశలో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.
శ్వేతా బసు వ్యభిచార ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనం. ఆమె పోలీస్ రైడ్స్ తో దొరికిపోయారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ వార్త ప్రకంపనలు రేపింది. అయితే ఈ ఆరోపణలు ఆమె ఖండించారు. కుట్ర పూరితంగా కొందరు ఇరికించారు. అవాస్తవాలు ప్రచారం చేశారని ఆమె వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఆ వార్తలు ఆమె ఇమేజ్ దెబ్బ తీశాయి. దాంతో అవకాశాలు పూర్తిగా ఆగిపోయాయి.
శ్వేతా బసు ప్రసాద్ బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. దాంతో కెరీర్ ముగిసిందని అందరూ అనుకున్నారు. మరలా కష్టపడి పూర్వ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా హిందీ చిత్రాలు, ఓటీటీ సిరీస్లు చేస్తుంది. అడపాదడపా ఆఫర్స్ తో అలా నెట్టుకొస్తోంది. శ్వేతా బసు నటించిన చివరి తెలుగు చిత్రం విజేత. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించారు.
ఇక సోషల్ మీడియాలో అమ్మడు యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా బ్రాను తలపించే టాప్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. అమ్మడు తీరుకు సోషల్ మీడియా జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram